.


' మహా శివరాత్రి ' - 'లింగోద్భవకాలము.' [తేది 12-02-10 ]

"బ్రహ్మ" , "విష్ణువు" లు యిరువురూ పోటీపడి తమలో అధికులు యెవరో తెలియజేయమని "పరమేశ్వరుని" కోరగా "పరమేశ్వరుడు" తన ఆది,అంతము కనుగొనమని ఆద్యంత రహితముగా భూమిలోనుండి ఆకాశములోనికి లింగ రూపములో ప్రత్యక్షమయ్యాడు.

"బ్రహ్మ", "విష్ణువు" లు యిద్దరూ కలిసి "నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగమూర్తయే " అని స్తోత్రము చేశారు. [ఈ స్తోత్రాన్ని శివ లింగ దర్శనము చేయు సమయములో ,అర్చన సమయములో పఠిస్తే చాలా శ్రేష్టము]

మహా శివరాత్రి నాడు అర్ధరాత్రి సమయములో "పరమేశ్వరుడు" లింగ స్వరూపములో ఉద్భవించాడు. అదే శివలింగోద్భవ కాలము.ఆనాటి నుండి శివలింగ అరాధన మొదలయ్యింది. కర చరణాది అవయవాలు యేవీ లేని నిరాకార జ్యోతి రూపమే లింగము. జ్యోతి అన్ని దిక్కులనూ చూస్తుంది. పర బ్రహ్మ,శాశ్వతుడు అయిన "శివుడు" బ్రహ్మజ్యోతి స్వరూపుడు కనుకనే లింగ రూపుడై పూజల అందుకుంటున్నాడు. లింగ శబ్దానికి అర్ధము యేమిటనగా "లయనాల్లింగ ముచ్యతే" అనగా - యీ సృష్టి అంతా దేనిలో లయమయి [లీనమయి] ఉన్నదో అదే లింగము.

సముద్రము నుండి బయల్వెడలిన కాలకూట విషాన్ని పరమేశ్వరుడు పానము చేశాడు. తన శిరస్సు చల్లపడుటకై తన తలపై గంగను మరియు చంద్రుని ధరించెను. అతనికి అగ్నితో సమానమైన మూడవ నేత్రము ఉన్నది. నిరంతరము అభిషేకము చేయుటచే చల్లబడును.

శివుని పూజయందు అభిషేకము ఒక ప్రధానమైన అంశము. అభిషేకములేని శివపూజ అసంపూర్ణముగా ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు . అభిషేకమునకు గంగా జలము,పాలు,నెయ్యి, తేనె, గులాబి జలము, కొబ్బరి నీరు, చందనము, పంచామృతము, సుగంధ ద్రవ్యము,చెరుకు రసము మరియు నిమ్మ రసము లు వాడతారు.

-----ఈ వ్యాసము తేదీ 26-02-93 స్వాతి వార పత్రిక ' సత్యాన్న్వేషణ ' శీర్షిక లోనిది.

తేది 12-02-10 న విశాఖ జిల్లా , భీమునిపట్నము బాలికల పోలిటెక్నిక్ కాలేజి కి వెళ్ళే త్రోవలో , n v కోలనీలో ,సుందర వనములో మహా శివ రాత్రి పర్వదినమున లింగోద్భవ సమయములో యీ సాధకునిచే నిర్వ హించబడుతున్న ' సామూహిక శివ పంచాక్షరీ మంత్ర జప సహిత మహా జ్యోతిర్లింగ అర్చనకు ఆహ్వానము పలుకుతున్నాము. భక్తులందరూ " ఓం నమశ్శివాయ" జపము చేస్తూ 500 లకు పైగా జ్యోతులను పార్ధివ శివలింగముపై పేర్చి మహా జ్యోతిర్లింగమును తయారు చేస్తారు. లింగోద్భవ సమయమునకు జ్యోతిర్లింగము పూర్తి అవుతుంది. ఆ విధముగా జ్యోతులతో యేర్పడిన జ్యతిర్లింగమును చూచుటకు భగవంతుడిచ్చిన రెండు నేత్రమలు చాలవు. లింగోద్భవ సమయములో జ్యోతులనుండి వచ్చు శబ్దములో ఒంకారము వుంటుందని పేద్దలు చెప్తారు.

గురు దేవులు శ్రీ ఆంజనేయ స్వామి దయ వలన జరుగుతున్న యీ కార్యక్రమమునకు మీరు రాలేక పోయినా లింగోద్భవ కాలములో మీరు వినోద కార్యక్రమములతో కాలక్షేపము చేయకుండా జీవితమును సార్ధకము చేసుకోవలసిందిగా కోరుతున్నాను.

మాతృ దేవో భవ! పితృ దేవో భవ !! ఆచార్య దేవో భవ !!!!

జై మారుతీ! జై జై మారుతీ!!

.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి