.

నిత్య పూజ --పితృదేవతలు అమరులే !


నిత్య పూజ --పితృదేవతలు అమరులే !


పితృదేవతలు అందరూ అమరులవంటివారే! అయితే దేవతలు ఉత్తర దిశలో నివసించుచున్నారు. పితరులు దక్షిణ దిశలో తమ నివాసమును యేర్పరచుకున్నారు. పరమపదించిన బాంధవులకు అతి భక్తితో శ్రాధ్ధకర్మలు ఆచరించినందువల్ల పితరులకు అమిత ఆనందము కలుగుతున్నాది. అందువల్ల పితృదేవతలు శ్రాధ్ధకర్మలు ఆచరించిన వారికి అందరికీ ఐహిక సుఖాలే కాక ఉత్తమమైన పుణ్యగతిని ప్రసాదిస్తున్నారు. మానవులకే కాక సుర , అసుర , గరుడ , గంధర్వ , యక్ష , కిన్నెర , కింపురుషాదులు అందరికీ పితృదేవతలు పూజనీయులే !


%%%%%%%%%%%%



మానవుల - పితృదేవతల - దేవతల కాలమానము.


మానవుల యొక్క శుక్లపక్షము [ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ] పితృదేవతలకు ఒక పగలు , కృష్ణపక్షము [ పాడ్యమి నుండి అమావాస్య వరకు ] ఒక రాత్రి. అనగా మానవులకు ఒక మాసము పితృదేవతలకు ఒక దినము అగును. అందుచేతనే ప్రతీ అమావాస్య నాడు పితృతర్పణము , పిండ ప్రదానము చేయుటకు కారణము. మరణించిన పిదప ఒక సంవత్సరము వరకు ప్రతీ నెలా అమావాస్య నాడు చేసే పితృతర్పణము పితృదేవతలకు నిత్యమూ [ ప్రతీ దినము ] అన్నమిడినట్లుండును.

మానవుల యొక్క ఉత్తరాయణపు ఆరు మాసములు దేవతలకు ఒక పగలు , దక్షిణాయపు ఆరు మాసములు ఒక రాత్రి. అనగా మానవులకు ఒక సంవత్సర కాలము దేవతలకు ఒక దినము. అందుచేతనే సంవత్సరమునకు ఒక పర్యాయము ఉత్సవములు జరుపుతున్నారు. ఆ విధమగా చేయుట వలన దేవతలకు నిత్యము [ప్రతీ దినము ] పూజా జరిపించినట్లుండును.
.

అల్లూరి సీతారామరాజు గారి విశేషాలు.







అల్లూరి సీతారామరాజు గారు ఆంగ్లేయులచే చంపబడలేదా ?

ఆయన పోలికలతో ఉన్న యింకొకాయన చంపబడ్డారా ?

ఆయన బర్మా , రంగూనులో అజ్ఞాతవాసములో 14 సంవత్సరాలు గడిపి వచ్చి ఆశ్రమము స్థాపించి సాధుజీవనము గడుపుతూ 8 మంది భార్యలను వివాహము చేసుకున్నారా ?

ఆశ్రమములో ఉన్న అల్లూరి సీతారామరాజు గారిని కలవడానికి ఆయన తల్లి గారు , మల్లుదొర తరచుగా వచ్చేవారా ?

ఈ మధ్య 2 tv chaannels వారు అల్లూరి సీతారామరాజు గారి గురించి పైన చెప్పబడిన విషయాలను ప్రసారము చేశారు. వారు చెప్పిన విషయాలు యేమిటంటే .......

అల్లూరి సీతారామరాజు మన్యసీమలో సుమారు 500 మందితో ఆంగ్లేయలను ఎదిరించడానికి ధర్మయుద్ధము చేసారు . అపారమైన ఆంగ్లేయుల సేనతో తలపడలేక , తనకోసము ఆంగ్లేయులు మన్యసీమలోనివారిని చిత్రహింసలు చేస్తుంటే 1923 మే నెల 23 వ తారీఖున లొంగిపోతున్నట్టుగా కబురు పంపారు. 1924 లో 'రూధర్ ఫర్డ్ ' ఆధ్వర్యములో లొంగిపోయిన సీతారామరాజును చెట్టుకు కట్టి ' గుడాల్ 'అనే అతను తుపాకితో కాల్చి చంపారు. మరణించినప్పుడు సీతారామరాజు వయస్సు 27 సంవత్సరాలు.

ఇంతవరకు ఆ చానల్సు వారు చెప్పింది బాగానే వుంది. ఆ తరువాత విషయాలు వింతగా వున్నాయి.

అల్లూరి సీతారామరాజు మరణించలేదనీ , మరణించినది ఆయన పోలికలు ఉన్న 'వీర వెంకటాచారి ' అనీ , సీతారామరాజుకు కుడి కణతమీద పుట్టుమచ్చ ఉందనీ , సీతారామరాజు చనిపోయినట్టుగా ప్రభుత్వము ప్రకటించిన శవముపై ఆ పుట్టుమచ్చలేదనీ అన్నారు. ఆయన ఖాకీ నిక్కరు, తెల్ల జుబ్బా ధరించేవారనీ చెప్పారు .

ఆ సంఘటన తరువాత సీతారామరాజు బర్మా ,రంగూనులో 14 సంవత్సరాలు అరణ్యవాసము చేసి 1941 లో బెండపూడి గ్రామమునకు వచ్చి ఆశ్రమము స్థాపించి ' బెండపూడి సాధువు ' గా పిలువబడుచూ 20 సంవత్సరాలు ఉన్నారని , ఆశ్రమములో నిత్యాన్నదానము జరిగేదనీ చెప్పారు.

బెండపూడి సాధువు 8 మంది క్షత్రియ కన్యలను వివాహమాడినట్టుగా చెప్పారు.

బెండపూడి సాధువును చూడడానికి అల్లూరి సీతారామరాజు తల్లి , మల్లు దొర , లక్ష్మన్నదొర తరచుగా వచ్చేవారని చెప్పారు.

అల్లూరి సీతారామరాజు తమ్ముడి కొడుకు ' రామరాజు ' ఫోనులో మాట్లాడుతూ , తనకు పెద్ద నాన్నగారి పేరే పెట్టారని చెప్పారు. సీతారామరాజు గారు వివాహము చేసుకోను అని అనేవారని , తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళేరని , అక్కడివారి బాధలను చూడలేక ధర్మ యుద్దము చేశారని చెప్పారు.

బెండపూడి సాధువు కోడలు ' వరలక్ష్మి ' మాట్లాడుచూ బెండపూడి సాధువు 'సీతారామరాజే 'అని యెప్పుడూ యెవ్వరితోను చెప్పలేదని అన్నారు.

అల్లూరి సీతారామరాజు చరిత్ర సినిమా తీస్తామని పెద్దలు అడిగితే , అసలే ఆయన నిజ జీవితానికీ , లోకములో ప్రచారమవుతున్న విషయాలకు యెక్కడా పొంతన లేదనీ , సినిమా తీయడానికి యిచ్చినా నిజమైన చరిత్ర తీయరనీ , అందుచేత ఆయన నిజ చరిత్ర యివ్వనని మల్లన్నదొర వ్రాసిన ఉత్తరము చూపించారు.

ఇవీ ఆ చానల్సు వారు ప్రసారము చేసిన విషయాలు.

అయితే ఈ సాధకుడు 1985 లో ' క్రిష్ణ దేవి పేట ' వెళ్ళడము సంభవించింది. ' శ్రీ మోపిదేవి క్రిష్ణ స్వామి ' గారు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తుంటారు . వారు ఒకసారి యీ సాధకునిచే సంకీర్తన కార్యక్రమము పెట్టించుకున్నారు. వారు క్రిష్ణదేవిపేటలో 7 దినములు ఉపన్యాసములు యివ్వడానికి వెళ్తూ మా బృందానికి గూడా ఆహ్వానము పంపించారు. క్రిష్ణదేవిపేట వాస్తవ్యులు , ఆ కార్యక్రమ నిర్వాహకులు , శ్రీ దరిశి సత్యనారాయణగారు మమ్మల్ని స్వయముగా ఆహ్వానించారు. అక్కడ మా కార్యక్రము జరుగుతుండగా ఆయన మా వూరి ప్రత్యేకత చూపిస్తానని ఆ వూరి చివరకు [అడవికి వెళ్ళే దారికి] తీసుకువెళ్ళారు. నేలలోనే పీఠము ఉన్న ఒక శివలింగము చూపించి ' అల్లూరి సీతారామరాజు గారి తల్లి యిక్కడకు వచ్చేవారు. ఆవిడను కలవడానికి సీతారామరాజుగారు పులిమీద వచ్చేవారు. పులి పాలతో యీ శివలింగానికి అభిషేకము చేసేవారు.తల్లితో మాట్లాడి ఆవిడ తెచ్చినవి తిని వెళ్ళిపోయేవారు ' అని చెప్పారు.

ఒక్కసారిగా ఒళ్ళంతా జలదరించింది ! సీతారామరాజు పేరు వింటేనే తనువు పులకరిస్తుంది ! అటువంటిది ఆయన తిరిగిన ప్రదేశాలలో తిరగడమే కాకుండా ఆయన పులి పాలతో అభిషేకము చేసిన శివలింగమును తాకే అదృష్టము పొందిన యీ సాధకునికి కళ్ళంట నీళ్ళు వచ్చాయి. అయితే యింత చరిత్ర కలిగిన ఆశివలింగము ఆలనా - పాలనా చూసే దిక్కు లేక ,ఆచ్చాదన లేక శివలింగము బరువుకి నేలలో కూరుకుపోతున్నాది. బరువెక్కిన గుండెలతో తిరిగి వస్తున్నాము.


త్రోవలో ఒక దగ్గర ఆగి, ' ఆనాడు అడవిలో సీతారామరాజు గారిని కాల్చి చంపి , తిరగవేసిన నులక మంచము మీద ఆయన భౌతిక దేహాన్ని తీసుకువచ్చి యిక్కడ దించారు. ఆ సమయములో అక్కడ చేరినవారిని అందరినీ , ఇతనేనా సీతారామరాజు ? అని అడిగారు. చుట్టూ చేరినవారు యెవ్వరూ మాట్లాడలేదు. విగత జీవుడై మంచము మీద పడివున్న తమ ప్రియతమ నాయకుడిని చూస్తూ నిశ్చేష్టులయిపోయారు. యెవరిని అడిగినా మాట్లాడకపోవడముతో ఆయనను తీసుకువచ్చినవాళ్ళు ఆయనను కాళ్ళతో తన్నారు. అంతే అది చూసి తట్టుకోలేక గొల్లున రోదిస్తూ అందరూ ఆయన పాదాలమీద పడిపోయారు. అప్పుడు అతనే సీతారామరాజు అని వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు 'అని చెప్పారు.

ఆయన అడవిలో తపస్సు చేసుకునేవారని, కోయ దొరలతో సఖ్యముగా వుండేవారని , వారి పరిస్తితిని చూసి ఉత్తేజితులై ధర్మయుధ్ధానికి పూనుకున్నారని చెప్పారు. ఆయనకు శక్తులు ఉన్నాయని , అప్పుడప్పుడు మల్లుదొర, గంటందొర మొదలైన వారితో అడవిలో వెళ్తుండగా హఠాత్తుగా ఉత్తరదిక్కువైపు తిరిగి యెవరో చెప్పుతున్నది వినేవారని , యేమిటి దొరా అలాగ ఆగిపోయారు ? ఆకాశములోనికి చూస్తూ యెవరితో మాట్లాడుతున్నారు? అని అడిగితే కలకత్తా నుండి 'అరవింద ఘోష్ గారు ' మాట్లాడేరని 10 దినములలో ముఖ్యమైన సమావేశము ఉన్నాదనీ దానికి తప్పకుండా రావాలని చెప్పేరని , ఉత్తరము కూడా వ్రాసేరట అది వస్తుంది అని చెప్పారుట. ఆ విధముగానే ఉత్తరము వచ్చేదట . ఆయన ముఖము తేజస్సుతో ఉండేదట.

ఈ సాధకడు చిన్నప్పటినుండి యెన్నోసార్లు యెంతోమంది కళాకారులు అల్లూరి సీతారామరాజు ఏక పాత్రాభినయనము చేయగా చూసాడు. అదంతా నిజముగా జరుగలేదు. యెవరో మహానుభావుడిచేత సృష్టించబడింది. క్రిష్ణదేవిపేట [k.d.peta] లోనున్న సామాన్యులకు తెలిసిన నిజాలను అనేక రసాలతో కూర్చిన ఆ కల్పిత గాధ మరుగుపరచింది.


ఆయన మరణించలేదని యెక్కడో అజ్ఞాతవాసము చేసి వచ్చి బెండపూడి లో సాధువుగా అవతారము యెత్తి 8 మంది క్షత్రియ కన్యలను వివాహము చేసుకున్నారని యెవరు చెప్పినా సగటు భారతీయుడు అంగీకరించడు.


జై మారుతీ! జై మారుతీ !!






.

మానవ జన్మము - భగవత్భజనావశ్యకత!






* మానవ జన్మము దుర్లభము. ఎనుబది నాలుగు లక్షల జీవరాసులలో భగవంతునితో సమాన స్థితిని పొందినవాడు , ఉత్తమోత్తముడు - మానవుడు ! భగవంతుని కనుగొనగలిగిన జన్మ - మానవజన్మ! అట్టి జన్మను ఎత్తియు భగవత్భజన చేయకున్నవానిని ద్విపాద పశువుగా యెన్నవచ్చును. యుక్తా యుక్త విచక్షణ జ్ఞానము కలిగిన మానవుడు దానిని సద్వినియోగము చేసుకొని ఆత్మానాత్మ వివేచనము కలిగి భగవదారాధన చేయవలెను.

*కలియుగమందు యజ్ఞ యాగాది క్రతువులు , తపో నిష్టా గరిష్టలు ఆచరణకు దుస్సాధ్యము . సులభమైనది 'స్మరణ ' మరియు ' కీర్తన '.

* కలిసంతరణోపనిషత్తులో...

శ్లోకము :- హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం

. . . . . . . కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతి రన్యధా !

తాత్పర్యము :- హరి నామ స్మరణ వినా కలియుగములో మోక్ష సాధనకు వేరే గతి లేదు.

* మనో నిగ్రహమునకు నామ సంకీర్తనము అవసరము. నవ విధ భక్తి మార్గములలో ' కీర్తన ' ఒక్కటి. మనో ధారణకు , భవరోగములకు దివ్యమైన ఔషధము భగవత్కీర్తన.

* భగవదనుభూతిని పొందుటకు సంకీర్తన యోగా అనునది సులువైన , తేలికైన , తిరుగులేని , సరి అయిన మార్గము మరియు సరి అయిన పద్దతి.

* అల్లోపతి వైద్యము , ఆయుర్వేదోపతి వైద్యము , నేచురోపతి వైద్యము మరియు హోమియోపతి వైద్యము యివన్నీ విఫలము అవ వచ్చునేమో గాని భగవన్నామోపతి వైద్యము యెట్టి పరిస్థుతులలోనూ విఫలము కాదు. స్మరించిన వారిని త్రప్పక తరింప జేయును. అని శ్రీ శివానంద మహర్షి అన్నారు.

---వివేక చూడామణి ( డా..రామక లక్ష్మణ మూర్తి)


.

నిత్య పూజ --గురువు సహాయము కోరు!

నిత్య పూజ --గురువు సహాయము కోరు! గురువును సహాయము కోరు గురువు లేని ప్రయాణము ప్రమాదభరితమయినది. సద్గురు సహాయము లేకుండా మనస్సును జయించగలవాడు యెవ్వడు ? వలదిక ఇలలో ఇసుమంతైననూ సందేహం గురువు లేనిదే దుర్లభమోయీ భవతరణం ! గురువు వినా రుద్రాక్షలు దండగ ! గురువు వినా దనమ్ములు దండగ ! గురువు వినా ప్రతీయత్నము దండగ ! ఉందీ సత్యం పురాణాల నిండుగ !! గురువు లక్షణాలు ! పరోపకార భావన , జప పూజాదుల ఆచరణ , సార్ధకమయిన పలుకు , శాంత స్వభావము , వేద వేదాంగాలు క్షుణ్ణంగా తెలిసి యుండుట , యోగ శాస్త్ర సిద్దాంతాలను సులువుగా బోధించగలుగుట , దేవతల మనస్సులను సంతోష పెట్టగలిగియుండుట మొదలయిన సుగుణాలతో పరిపూర్ణుడైన వాడే సద్గురువు ! ఇంతే కాదు సర్వ విధి సామర్ధ్యము మంచి మాటకారితనము , చక్కని తేజస్సు , దాన గుణము , పరిశుద్దమయిన మనస్సు , పృధివి మొదలైన పంచ భూతాల తత్వము ఎరిగి వుండుట మొదలైన లక్షణాలు కలిగియున్న వ్యక్తి సద్గురువు !
.
నిత్య పూజ సద్గురువు. ( 1 వ భాగము ) నిజమైన గురువు ఎవరో ఆ సద్గురువుని లక్షణాలెటువంటివో తెలుసుకోవడము అందరికీ అవసరము. ముఖ్యముగా ఆధ్యాత్మిక సాధకులకూ , ఆత్మ జిజ్ఞాసులకూ ఎంతో శ్రేయస్కరము. వేదాంత శాస్త్రాలలో " గురు " అనే పదానికి అర్ధము యీ విధముగా చెప్పబడింది. శ్లోకము : గు కార స్త్వంధకారోస్తు రు కార స్తన్నిరోధక : ! అంధకార నిరోధత్వం గురు రిత్యభిధీయతే !! తాత్పర్యము : 'గు ' అనే పదము అజ్ఞానమనే అంధకారాన్ని సూచించేదని , 'రు ' అనే పదము దానిని నిరోధించేదని , అంధకారాన్నినిరోధించేది కనుక 'గురు ' అనగా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడని అర్ధము. 77777 సద్గురువుని గురించి 'యోగ వాశిష్టంలో ' యిలా స్పష్టము చేయబడింది. శ్లోకము : దర్సనా త్స్పర్శనా చ్చబ్దా త్కృపయా శిష్య దేహకే , జనయే ద్య: సమావేశం శాంభవం స హి దేశిక: ! తాత్పర్యము : దర్శనము వలనా , స్పర్శ చేతా , కృపా కటాక్షములతో కూడిన ప్రబోధ వాక్యముల వలనా , శిష్యుని హృదయమందు శివ జ్ఞానపరమైన ఆత్మతత్వ సమావేశమును ఎవరు జనింపజేయగలుగునో , అటువంటి మహనీయుడే నిజమైన సద్గురువు. %%%%%%% శ్లోకము : సర్వే శృణుత భద్ర వో నిశ్చయేన సునిశ్చితం , ఆత్మ జ్ఞానా త్పరం నాస్తి గురో రపి చ తద్విధ: ! తాత్పర్యము : ఓ జనులారా ! మీకు శుభము కలుగు గాక ! మీరందరూ అత్యంత నిశ్చయమైన , పరమ సత్యమైన ఈ మహత్తర విషయమును వినుడు. " ఆత్మ జ్ఞానము కంటెను , ఆత్మ జ్ఞాన అనుభవజ్ఞుడైన సద్గురువు కంటెను మించినది ఈ లోకమందేదియును లేదు " @@@@@@ శ్లోకము : పద వాక్య ప్రమాణజ్ఞై ర్దీపభూతై: ప్రకాశితం , బ్రహ్మ వేద రహస్యం యై స్తా న్నిత్యం ప్రణతో స్మ్యహం ! ( .పా ) తాత్పర్యము : వేదాంత మహావాక్య ప్రమాణాల్ని సంపూర్ణముగా ఎరిగిన వాడవడము వలన , దీపము వస్తువుల్ని ఎలా ప్రకాశింపజేస్తుందో , అలా వేద రహస్యమైన బ్రహ్మ స్వరూపాన్ని ప్రకాశింపజేసి , శిష్యునికి గోచరిన్పజేసె సద్గురు మహనీయునికి సర్వదా ప్రణామములు అర్పించుచున్నాను. ()()())() గురుని ఆవశ్యకత : ఆత్మ జ్ఞాన సంపన్నుడైన గురువు ముఖమున స్వయముగా బ్రహ్మవిద్యను అభ్యసించాలని , సద్గురుని అనుభవైక ప్రబోధాలవల్లకాక , కేవలము శాస్త్ర ప్రమాణముల చేత నేర్చుకున్న విద్య ఫలప్రదము కాదని , ఆత్మవేత్తలైన సద్గురువుల వల్ల నేర్చుకున్న విద్యయే సుస్థిరమైన ,ఫలప్రదమైన ఆధ్యాత్మిక ప్రగతిని కలుగ జేస్తుందని శృతులలో చెప్పబడింది. అయితే పక్వ జీవులైన కొందరు మహనీయులు పూర్వ జన్మ సుకృతమువలన ఏ గురువునూ ఆశ్రయించకనే , సక్రమమైన స్వకీయమైన పురుష ప్రయత్నము చేసుకొని , ఆత్మ సిద్ధిని పొందడము కూడా గమనార్హము. అటువంటివారికి వారి ఆంతర్యములోవున్న పరమాత్మ స్వరూపుడే తోడ్పడుతూ , ఆధ్యాత్మిక ప్రగతినీ , ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంటాడు. { జనవరి 1994 సప్తగిరి సౌజన్యముతో. } &&&&& ఎటువంటివాడు గురువు ? * వ్యక్తులలో అంతర్లీనముగా ఉన్న చైతన్య శక్తులను జాగృతం చేసి కర్మాచరణకు స్పూర్తిని యిచ్చేవాడు - గురువు ! * వారిలోని చొరవను , సృజనాత్మకతను వ్యక్తపరచడానికి తగిన మార్గము చూపేవాడు - గురువు ! * దిక్కుతోచక , దిగులుతో బాధపడుతున్నప్పుడు ధైర్యము చెప్పి ముందుకు నడిపించేవాడు - గురువు ! * తమలోని దివ్యత్వాన్ని దర్శించి , ఆచరణలొ ధార్మికతగా దానిని అమలుపరచగల ధీమంతులుగా వ్యక్తులను తీర్చిదిద్దే దార్శనికుడు - గురువు ! ( మార్చి/ 2002 భక్తి నివేదన సౌజన్యముతో ) సద్గురువు. ( 1 వ భాగము ) నిజమైన గురువు ఎవరో ఆ సద్గురువుని లక్షణాలెటువంటివో తెలుసుకోవడము అందరికీ అవసరము. ముఖ్యముగా ఆధ్యాత్మిక సాధకులకూ , ఆత్మ జిజ్ఞాసులకూ ఎంతో శ్రేయస్కరము. వేదాంత శాస్త్రాలలో " గురు " అనే పదానికి అర్ధము యీ విధముగా చెప్పబడింది. శ్లోకము : గు కార స్త్వంధకారోస్తు రు కార స్తన్నిరోధక : ! అంధకార నిరోధత్వం గురు రిత్యభిధీయతే !! తాత్పర్యము : 'గు ' అనే పదము అజ్ఞానమనే అంధకారాన్ని సూచించేదని , 'రు ' అనే పదము దానిని నిరోధించేదని కనుక 'గురు ' అనగా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడని అర్ధము. 77777 సద్గురువుని గురించి 'యోగ వాశిష్టంలో ' యిలా స్పష్టము చేయబడింది. శ్లోకము : దర్శనా త్స్పర్శనా చ్చబ్దా త్కృపయా శిష్య దేహకే , జనయే ద్య: సమావేశం శాంభవం స హి దేశిక: ! తాత్పర్యము : దర్శనము వలనా , స్పర్శ చేతా , కృపా కటాక్షములతో కూడిన ప్రబోధ వాక్యముల వలనా , శిష్యుని హృదయమందు శివ జ్ఞానపరమైన ఆత్మతత్వ సమావేశమును ఎవరు జనింపజేయగలుగునో , అటువంటి మహనీయుడే నిజమైన సద్గురువు. %%%%%%% శ్లోకము : సర్వే శృణుత భద్ర వో నిశ్చయేన సునిశ్చితం , ఆత్మ జ్ఞానా త్పరం నాస్తి గురో రపి చ తద్విధ: తాత్పర్యము : ఓ జనులారా ! మీకు శుభము కలుగు గాక ! మీరందరూ అత్యంత నిశ్చయమైన , పరమ సత్యమైన ఈ మహత్తర విషయమును వినుడు. " ఆత్మ జ్ఞానము కంటెను , ఆత్మ జ్ఞాన అనుభవజ్ఞుడైన సద్గురువు కంటెను మించినది ఈ లోకమందేదియును లేదు " @@@@@@ శ్లోకము : పద వాక్య ప్రమాణజ్ఞై ర్దీపభూతై: ప్రకాశితం , బ్రహ్మ వేద రహస్యం యై స్తా న్నిత్యం ప్రణతో స్మ్యహం ! ( ఉ .పా ) తాత్పర్యము :వేదాంత మహావాక్య ప్రమాణాల్ని సంపూర్ణముగా ఎరిగిన వాడవడము వలన , దీపము వస్తువుల్ని ఎలా ప్రకాశింపజేస్తుందో , అలా వేద రహస్యమైన బ్రహ్మ స్వరీపాన్ని ప్రకాశింపజేసి , శిష్యునికి గోచరింపజేసే సద్గురు మహనీయునికి సర్వదా ప్రణామములు అర్పించుచున్నాను. గురుని ఆవశ్యకత : ఆత్మ జ్ఞాన సంపన్నుడైన గురువు ముఖమున స్వయముగా బ్రహ్మవిద్యను అభ్యసించాలని , సద్గురుని అనుభవైక ప్రబోధాలవల్లకాక , కేవలము శాస్త్ర ప్రమాణముల చేత నేర్చుకున్న విద్య ఫలప్రదము కాదని , ఆత్మవేత్తలైన సద్గురువుల వల్ల నేర్చుకున్న విద్యయే సుస్థిరమైన ఫలప్రదమైన ఆధ్యాత్మిక ప్రగతిని కలుగ జేస్తుందని శృతులలో చెప్పబడింది. అయితే పక్వ జీవులైన కొందరు మహనీయులు పూర్వ జన్మ సుకృతమువలన ఏ గురువునూ ఆశ్రయించకనే , సక్రమమైన స్వకీయమైన పురుష ప్రయత్నము చేసుకొని , ఆత్మ సిద్ధిని పొందడము కూడా గమనార్హము. అటువంటివారికి వారి ఆంతర్యములోవున్న పరమాత్మ స్వరూపుడే తోడ్పడుతూ , ఆధ్యాత్మిక ప్రగతినీ , ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంటాడు. { జనవరి 1994 సప్తగిరి సౌజన్యముతో. } &&&&& ఎటువంటివాడు గురువు ? * వ్యక్తులలో అన్యర్లీనముగా ఉన్న చైతన్య శక్తులను జాగృతం చేసి కర్మాచరణకు స్పూర్తిని యిచ్చేవాడు - గురువు ! * వారిలోని చొరవను , సృజనాత్మకతను వ్యక్తపరచడానికి తగిన మార్గము చూపేవాడు - గురువు ! * దిక్కుతోచక , దిగులుతో బాధపడుతున్నప్పుడు ధైర్యము చెప్పి ముందుకు నడిపించేవాడు - గురువు ! * తమలోని దివ్యత్వాన్ని దర్శించి , ఆచ్రణలో ధార్మికతగా దానిని అమలుపరచగల ధీమంతులుగా వ్యక్తులను తీర్చిదిద్దే దార్శనికుడు - గురువు ! ( మార్చి/ 2002 భక్తి నివేదన సౌజన్యముతో ) నిత్యపూజ - గురు వందనం 2వ భాగము. శ్లోకము : నారాయణ సమారంభాం - శంకరాచార్య మధ్యమాం ! అస్మద్గురు పర్యంతం - నమామి గురు పరంపరాం !! తాత్పర్యము : 'నారాయణుని నుండి శంకరాచార్యుని వరకు , మళ్ళీ ఆయన చెప్పిన ధర్మాన్నే మనకు చెప్పిన మన గురువుగారి వరకూ ఉన్న గురుపరంపరకు నమస్కారములు ' (మనది శాశ్వతమైన సనాతన ధర్మము. దీనికి భగవానుడైన నారాయణుడు ఆది గురువు .ఆయన నుండి బ్రహ్మ , బ్రహ్మ నుండి వశిష్టుడు , వశిష్టుని నుండి శక్తి , శక్తినుండి పరాశరుడు , పరాశరుడి నుండి వ్యాసుడు , వ్యాసుని నుండి శుకుడు , శుకుని నుండి గౌడపాదుడు , గౌడపాదుడి నుండి గోవింద భగవత్పాదుడు , గోవింద భగవత్పాదుని నుండి ఆదిశంకరాచార్యులు సనాతన వేద ధర్మాన్ని స్వీకరించారు. ఆ సనాతన ధర్మాన్ని ఉపదేశించి మనలను ఆధ్యాత్మిక మార్గములో నడిపించే గురువే గురువు.) శ్లోకము : గురవో నిర్మలా శాంతా: - సాధకా మిత భాషణ: ! ఏతై: కారుణ్యతో దత్తో - మంత్ర: క్షిప్రం ప్రసీదతి !! తాత్పర్యము : గురువులనగా నిర్మలమైన వారు , శాంత స్థితి కలవారు , సాధకులగువారు , మితభాషులగువారు. అట్టి వారిచే దయతో ఈయబడు మంత్రము వెంటనే అనుగ్రహించ గలదు. 909090 శ్లోకము : నిత్యాయ నిర్వికల్పాయ - నిరవద్యాయ యోగినే ! నిర్మలాయ గిరీశాయ - శివాయ గురవే నమ : తాత్పర్యము : నిత్యుడు , పొరపాటు అనునది లేనివాడు , ఆక్షేపణ లేనివాడు, చిత్తవృత్తులను నిరోధించిన వాడు , నిర్మలుడు , బృహస్పతి సముడు , మంగళ స్వరూపుడు అగు గురువునకు నమస్కారము. శ్లోకము : శరణం సద్గురు చరణం - నిగమాభరణం భవాబ్ది సంతరణం ! యత్పరిచరణం కరణం - అనిష్ట నివృత్తే రభీష్టాస్తే : !! ( నవంబరు 1999 వేదాంతభేరి సౌజన్యముతో ) తాత్పర్యము : వేదవేత్తలగు సద్గురువుల పాదపద్మములే జనులకు శరణ్యము. సంసార సముద్రమును అయ్యవి అవలీలగా దాటించివేయగలవు. అనగా గురుభక్తి కలవారు , దైవభక్తి కలవారు , సంసార సాగరమును సులభముగా దాటివేయగలరు. కాబట్టి అనిష్టమగు బంధము యొక్క నివృత్తి కొరకును , అభీష్టమగు మోక్షము యొక్క ప్రాప్తి కొరకును జనులు గురుదేవుల పాదపద్మములను తప్పక ఆశ్రయించవలెను. %%%%%% శ్లోకము : అజ్ఞాన తిమిరాంధస్య - జ్ఞానాంజన శలాకయా ! చక్షు రున్మీలితం యేన - తస్మై శ్రీ గురవే నమ : !! తాత్పర్యము : అజ్ఞానమనే అంధకారముతో మూసుకుపోయిన నా కళ్ళను జ్ఞానాంజనమనే దీపముతో వెలుగులోనికి తెచ్చిన నా గురుదేవులకు నమస్కారము. ()()()() శ్లోకము : యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో యస్యాప్రసాదా న్న గతి : కుతో అపి ! ధ్యాయం స్తువం సస్య యశ స్త్రి సంధ్యం వందే గురో : శ్రీ చరణారవిందం. !! తాత్పర్యము : ఆధ్యాత్మిక ఆచార్య్ని అనుగ్రహము వలన భగవంతుని అనుగ్రహము లభిస్తుంది. ఆయన అనుగ్రహము లేకపోతే ఏ వ్యక్తీ ముందుకు సాగలేడు. అందుచేత నేను నిరంతరము నా ఆధ్యాత్మిక ఆచార్యుణ్ణి కనీసము మూడు పర్యాయములు స్మరిస్తూ ఆయన చరణారవిందములకు ప్రణమిల్లుతాను. నిత్యపూజ - గురు శబ్దోచ్చారణ మాహాత్మ్యం.

'
గురు ' శబ్దంలో ' ' కారం , 'రేఫ ' , ' '

కారమనే మూడు వర్ణాలు ఉన్నాయి. వీటిలో ' ' కారము -
సిద్ధి ప్రదాయకము. ' రేఫ '- పాప హారకము. ' ' కారము - శివ స్వరూపము. కనుక 'గురు ' అనే శబ్దాన్ని ఉచ్చరిస్తే కోరికలు సిద్ధించడము , పాపాలు హరించడము , శివానుగ్రహమనే మూడు ఫలితాలు ఒకే సమయములో దక్కుతాయి. ఇదీ గురు శబ్దోచ్చారణ మహాత్మ్యం !

ఎవరు ఇతర జీవుల పట్ల ద్వేషము లేక , స్నేహ మమకారములు కలిగివుందురో , ఎవరు క్షమా గుణము కలిగి ఉందురో , ఎవరు సుఖ దు:ఖములను , సమానముగా చూడగలరో వారు పరమాత్మకు యిష్ఠులు !







.

ఆంజనేయుని సేవించువారికి మోక్షము,భోగము లభిస్తాయి!




శ్లోకం :- యత్రాస్తి భోగో - నహి తత్ర మోక్ష :

యత్రాస్తి మోక్షో- నహి తత్ర భోగ: !

శ్రీ మారుతేస్సేవన తత్పరాణాం

భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ !!






భావము : ఎచ్చట భోగము ఉండునో అచ్చట మోక్షము ఉండదు. ఎచ్చట మోక్షము ఉండునో అచ్చట భోగము ఉండదుకాని ఆంజనేయ సేవా తత్పరులకు భోగము,మోక్షము రెండును సిద్దించును.

అనగా భోగమును యిచ్చే పరమేశ్వరుడు మోక్షమును యివ్వలేడు. అలాగే మోక్షమును యిచ్చే శ్రీరాముడు(శ్రీమన్నారాయణుడు)భోగమును యివ్వలేడు.

ఇంకా చెప్పాలంటే శ్రీరాముడిని గాని, శ్రీకృష్ణుని గాని, శ్రీవేంకటేశ్వరుడిని గాని లేదా పరమేశ్వరుడిని గాని పూజించేవారు ఆంజనేయస్వామి ద్వారా వారిని పూజిస్తే ఈశ్వరాంశ సంభూతుడైన మరియు శ్రీరామదాసుడైన
ఆంజనేయస్వామి భక్తుల చిన్న చిన్న కోర్కెలు తీర్చడమే కాకుండా వారికి భోగమును మరియు మోక్షమును కూడా యిప్పించగలడు కనుక తులసిదాసు గారి అవధి( హిందీ) భాషలోని శ్రీ హనుమాన్ చాలీసాను ప్రతీ అక్షరమును స్పష్టముగా పలుకుతూ పారాయణ చేసుకోండి.

జై మారుతీ ! జై జై మారుతీ !!
.

బ్రహ్మ దేవుడికే వర్ణింప శక్యము కాని మహిమ గలవాడు శ్రీ ఆంజనేయస్వామి!




అంతర్జాల మితృలకు ' శ్రీ హనుమత్ జయంతి ' సందర్భముగా శుభాభివందనములు!

శ్లోకము : ఆంజనేయ: పూజితశ్చేత్ , పూజితా స్సర్వదేవతా: !

హనుమన్మహిమా శక్యో , బ్రహ్మణాపిన వర్ణితుం !!

భావము : ఆంజనేయస్వామిని పూజిస్తే సమస్త దేవతలనూ పూజించినట్లే ! బ్రహ్మదేవుడు కూడా వర్ణింపజాలని మహిమ హనుమన్మహిమ!!

****

ఆంజనేయుడు పుట్టగానే ఆకలితో సూర్యుడిని చూసి పండు అని భ్రమించి రెండు వేల యోజనముల దూరములో నున్నసూర్యుడిని మ్రింగబోగా దేవేంద్రుడు వజ్రాయుధముతో దవడమీద కొట్టగా దవడ ( హనువు ) వాచిపోయి , స్పృహతప్పివొక పర్వతము మీద పడిపోగా
వాయుదేవునికి దేవేంద్రుడిపై కోపమువచ్చి ఆంజనేయుని వొక గుహలోనికితీసుకుపోయి అన్నిలోకములలోను వాయు గమనాన్ని ఆపివేశాడు. గాలి ఆడక అన్నిలోకములలోని ప్రాణికోటులుఅల్లల్లాడిపోతుంటే దేవేంద్రుడు , బ్రహ్మదేముడితో సహా అందరు దేముళ్ళు దిగి వచ్చి ఆంజనేయుడికి తమ శక్తులన్నీదారపోసి ' నిన్ను పూజిస్తే తమను పూజించినట్టే ' అని మంగళాశాసనము చేశారు. హనువు వాచిపోవడము వలనఅప్పటినుండి ' హనుమ ' అని పిలువబడుతున్నాడు. అందరి దేవతల శక్తులు , ఆశీర్వచనములు పొందిన హనుమ ' సర్వదేవతాస్వరూపుడు ' అయినాడు.

ఆంజనేయుని గొప్పతనము గురించి వర్ణించడానికి బ్రహ్మదేవుడికే శక్యము కానప్పుడు మానవమాత్రులము మనముయేమి చెప్పగలము. అయినా ఉదాహరణకు ఒక్క విషయము చెప్పుకుందాము. శ్రీరామ - రావణ యుద్దముజరుగుతున్నాది. ఇంద్రుడినే జయించిన మేఘనాదుడు (ఇంద్రజిత్తు) తన తండ్రి రావణాసురుడు కన్నాభయంకరమయినవాడు. మాయలతో దొంగయుద్దముతో వానరవీరులను చీల్చి చెండాడుతూ మోహనాస్త్రముతో అందరినీ పడగొట్టాడు. ఇంతలో సూర్యాస్తమయము అవడముతో యుద్దము ఆగింది. రాత్రి విభీషణుడు లాంతరు పట్టుకొని యుద్దభూమిలో ప్రాణాలతో వున్నవారిని గుర్తించేందుకు వెతుకుతున్నాడు. అతనికి జాంబవంతుడుకనిపించాడు. జాంబవంతుడు విభీషణుని చూడగానే ' ఆంజనేయుడు క్షేమమేనా ? ' అని అడిగాడు. విభీషణునికిఆశ్చర్యమువేసి ' తాతా ! నువ్వు శ్రీరాముడిని అడగలేదు. లక్ష్మణుని అడగలేదు. సుగ్రీవుడిని అడగలేదు. అంగదుడిని అడగలేదు. కానియింత మందిని అడగకుండా ముందుగా ఆంజనేయుడిని అడుగుతున్నావు యెందుచేత ?' అని అడిగాడు. అందుకు జాంబవంతుడు ' విభీషణా ! ఆంజనేయుడు ఒక్కడు క్షేమముగా వుంటే నువ్వు యిప్పుడు అడిగినవాళ్ళందరూ క్షేమముగా వున్నట్టే ! ' అన్నాడు. అంటే ఆంజనేయుడు క్షేమముగా వుంటే మనకు నిశ్చింతే అని చెప్పకనే చెప్పాడు.

సాధకుడి నమ్మకము
యేమిటంటే యీ కలియుగములో ఆంజనేయస్వామి చిరంజీవిగా , సజీవముగా , సదేహముతో ఉన్నారు. ఆయన దేవతలందరి తరుపున వారి వారి భక్తులను గుర్తించి ఆ భక్తులకు వారి ఆరాధ్య దైవముల అనుగ్రహమును పొందేటట్టు చేస్తున్నారు. అనగా మనము యే దేముడిని కొలిచినా ఆంజనేయస్వామిని తలిస్తే మన ఆరాధ్య దేముడి అనుగ్రహము త్వరగా వస్తుంది.

ప్రతీ కుటుంభము వారికీ తరతరాలుగా యింటి దేవుడు ఒకరు ఉంటారు.ఆ దేముడిని యేవో పర్వ దినములలో మాత్రమే కాకుండా నిత్యమూ స్మరిస్తుండాలి.వినాయకుడితో మొదలు పెట్టి అందరు దేముళ్ళనూఒక్క సారి తలిచి మన ఆరాధ్య దేముడిని అందరికన్నా యెక్కువ సేపు తలచి ఆంజనేయస్వామిని ఒక్క సారయినాతలవాలి. యీ విధముగా 40 దినములు చేస్తే మన ఆరాధ్య దేముని అనుగ్రహ ధార మనపై ధారాళముగా ప్రవహిస్తుంది.


చాలామంది తమ యింటి దేముడిని ( యిలవేలుపుని ) మార్చివేయడమే కాకుండా మార్చిన దేముడీతోపాటు ఒకరుయిద్దరు దేముళ్ళనే అప్పుడప్పుడు అనగా సంవత్సరములో కొద్ది దినములు మాత్రమే తలుస్తున్నారు.
తర తరాలుగా మన పూర్వులు కొలిచిన ఇలవేలుపుల అనుగ్రహము మన యింటిగుమ్మములోనే ఆగిపోతున్నాది. అంతులేని దైవీ సంపదను- మన పెద్దలను తృణీకరించడము ద్వారా, మన యిలవేలుపును వదలి వేయడము ద్వారాకోల్పోతున్నాము.

...గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి తననే తలచినవారిని తనే నడిపిస్తారు ! ఇది నిజం !

జై మారుతీ! జై జై మారుతీ !!
-
.