.

ఋషీకేశ్ లో 636 వ సుందరకాండ కధాగానము జరిగింది.




అంతర్జాల మితృలకు నమస్కారము!
తేది 03-05-10 నుండి యీ రోజు(తేది 30-05-10)వరకు కలవనందుకు క్షంతవ్యుడిని. యీ సాధకుని ఆధ్యాత్మిక యాత్ర అంత సంతృప్తిగా లేకపోయినా సంకల్పము బలమైనది కనుక వృధాకాలేదు. హరిద్వార్ పూర్తిగా పర్యాటక కేంద్రముగా మారిపోయింది.

అసలు 1989 సెప్టెంబరు నెలలో మొట్టమొదటిసారి కేదార్నాథ్ , బదరీనాథ్ లు వెళ్ళేటప్పుడు ఆ పుణ్యభూమిని వదలి రావాలని అనిపించలేదు. చూసే ప్రతీ దృశ్యమూ దివ్యానుభూతియే! వేసే ప్రతీ అడుగూ గగుర్పాటే!

ఆ దివ్య క్షేత్రములో హరిద్వార్ , ఋషీకేశ్ , దేవ-ప్రయాగ , రుద్ర-ప్రయాగ , కర్ణ-ప్రయాగ, సోన-ప్రయాగ , నంద-ప్రయాగ( రెండు నదులు కలుస్తున్నప్పుడు ప్రయాగ అంటారు)మొదలయినవే కాకుండా ఉత్తర కాశీ , గుప్త కాశీ , గౌరీ కుండ్ , పంచ-కేదార్ , పంచ-బదరి , బదరీ వద్ద మానా గ్రామము వద్ద సరస్వతి నది అలకానంద లో కలిసే దృశ్యము , వ్యాస మహర్షి భారతము చెప్పుతుంటే వినాయకుడు వ్రాసినట్టుగా చెప్పబడే స్థలము , చైనా సరిహద్దుకు దగ్గరలోనున్న ఆఖరు పోస్టు ఆఫీసు , బదరీ నారాయణుడి ఆలయము వెనుకనున్న నీలకంఠ పర్వతమూ , బదరీకి వెళ్ళే త్రోవలో 10 కిలోమీటర్లముందు వున్న సంకీర్తన ఆంజనేయస్వామి దివ్య మంగళ విగ్రహమూ, యింకా యెన్నెన్నో దివ్యమైన స్థలములూ , పవిత్రతను పుణికి పుచ్చుకున్న ఆ దేవభూమిలో ఉన్నంతసేపూ తన్మయత్వముతో దివ్య లోకాలలో తేలిపోతున్న ఆనందమే! కేదార్నాథ్ , బదరీనాథ్ దేవాలయాలో కూర్చొని సంకీర్తన చేస్తుంటే ఉత్తరాదివారూ కూర్చొని పాల్గొనేవారు. భావనలూ , చర్యలూ పూర్తిగా దైవపరముగా ఉండేవి. ఆ దివ్య స్మృతులు జీవితాంతమూ పదిలపరచుకునేవారికి దైవానుగ్రహము కరతలామృతము.

ప్రతీ 4 సంవత్సరములకు ఒకసారి వెళ్ళే అదృష్టము 'స్వామి ' యిచ్చారు. రాను రానూ భక్తులు యెక్కువ అయ్యారు.సంవత్సరములో 6 మాసములు మాత్రమే అక్కడ వుండే అవకాశము కనుక భక్తులు యెక్కువ అయ్యేకొద్దీ వారి అవసరాలు తీర్చే స్థానికులు యెక్కువ అయ్యారు. స్థానికులు యెక్కువ అయ్యేకొద్దీ సహజ అరణ్యాల స్థానములో కాంక్రీటు అరణ్యాలు యెక్కువ అయ్యాయి. భక్తులతోపాటు పర్యాటకులు యెంత యెక్కువ అయ్యారంటే భక్తులకు పది రెట్లు అయ్యారు. దాంతో బాహ్య పరమయిన పవిత్రత కనుమరుగు అవుతున్నాది. పర్యాటకులు యెక్కువ అయ్యారు. జనాలూ , కాంక్రీటు వనాలూ యెక్కువ అవడమువలన పర్యావరణము పూర్తిగా దెబ్బతిన్నాది. కాలుష్యము విపరీతముగా పెరిగిపోయింది. స్థానికుల నివాసాలనుండీ , వ్యాపార కేంద్రాలనుండీ వ్యర్ధాలు పవిత్ర గంగలోనే కలుస్తున్నాయి. ఆధ్యాత్మిక కెంద్రాలు పర్యాటక కేంద్రాలుగా మారిపోయాయి. ఎప్పుడూ చల్లగా వుండే అక్కడ ఎండలు మండిపోతున్నాయి. .. అందుచేత దేవభూమిలో కలగవలసిన ఆధ్యాత్మిక భావాల బదులు లౌకిక భావాలు కలిగే పరిస్థితి ప్రస్థుతము నెలకొన్నది.

20 సంవత్సరముల క్రిందట కేదార్నాథ్, బదరీనాథ్ లకు వెళ్ళే దారులు మూసుకుపోతాయి, ఆ తరువాత భవిష్య బదరి , భవిష్య కేదార్ లలో మాత్రమే దర్శనము లభిస్తుంది అనేవారు. అలా జరిగినా బావున్ను.

అయితే యీ పరిణామాలకు మానసికముగా సిద్ధపడి వెళ్ళడము వలననూ , మన ఊర్లలో లౌకిక ప్రపంచములో మానవ నిర్మితమైన దేవాలయాలకు వెళ్ళేటప్పుడూ మరియు దైవ కార్యాలు చేసేటప్పుడూ ప్రశాంతతను , యేకాగ్రతను పొందే సాధన వలననూ ఋషీకేశ్ లో శ్రీ శివానంద ఆశ్రమములో వసతి భోజన సదుపాయములు లభించడము వలననూ అక్కడ వున్న 4 దినములు అద్భుత సాధన జరిగింది. నది ఒడ్డున స్వామి విగ్రహము వద్దా, ఆశ్రమములో చెట్ల క్రిందా వాద్య సహకారము లేకుండా '636 వ సుందరకాండ కధాగానము జరిపగలిగే అదృష్టము కలిగింది. ఆశ్రమములో గురు కుటీరములో సంధ్య హారతికి ముందు ఆశ్రమ వాసులతో కలిపి సంకీర్తన చేసే అవకాశము కలిగింది. శ్రీ శివానంద ఆశ్రమములో ఆశ్రమ పద్దతులు , నియమావళి చాలా చక్కగా వున్నాయి. బయట ప్రపంచము యెంత మారిపోయినా ఆ ఆశ్రమవాసులు మారకపోవడము చాలా గొప్ప విషయము!

ఇక హరిద్వార్ లో ప్రశాంతతకు అవకాశము లేదు. గంగా హారతికి ప్రతీ రోజు సాయంత్రము 10 వేలకు పైగా భక్తులు హాజరు అవుతున్నారు. అ రద్దీ తగ్గడానికి గంటకు పైగా సమయము పడుతున్నాది.

హరిద్వార్ నుండి వచ్చిన తరువాత మనసుకు కష్టము అనిపించి వారము దినములు యిల్లు కదలలేదు. ఆ తరువాత కార్యక్రమములు ,నైతిక బాధ్యతలు వల్ల తీరిక దొరకలేదు.


గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయతో మళ్ళీ కలుస్తాను.


జై మారుతీ! జై జై మారుతీ!!

.

హరి ద్వార్ , ౠషీకేశ్ లలో సాధన!



హరి-హరుల స్థావరాలకు ( కైలాస ,వైకుంఠములకు ) ద్వారమైన హరిద్వార్ నకు - భగీరధుడు భగీరధ ప్రయత్నముతో ధరణికి తెచ్చిన గంగోత్రితో కలసి మందాకినీ , అలకానంద నంద , పిండర గంగ మొదలైన పుణ్య నదులు సంగమముగా యేర్పడి హిమాలయములపైనుండి భూమి మీదకు పరవళ్ళు త్రొక్కుచూ ప్రవహించే పుణ్య క్షేత్రములైన ఋషీకేశ్ ,హరిద్వార్ లలో ఒక వారము దినములు భక్తి పారవశ్యముతో భగవత్ సాన్నిధ్య దివ్యానుభూతిని పొందుటకు తేది 03-05-2010 న బయలుదేరుతున్నాము.

గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయతో ఈ సాధకుడు యిప్పటికి నాలుగుపర్యాయములు కేదార్ నాథ్ , బదరీ నాథ్ వెళ్ళటమువలన యెంతో ఆధ్యాత్మిక శక్తిని తెచ్చుకున్నాడు.

ఏవిధముగా అంటే - హిమాలయా పర్వతాలలో జనారణ్యానికి దూరముగా ఆ లోయలలో , పర్వతాలలో వారము దినములు ప్రయత్నించినా వారిని చేరలేని ప్రదేశాలలో యెంతోమంది తపస్సు చేసుకుంటున్నారు. వారు ప్రతీ దినము మూడు సంధ్యలలో ఆపూట చేసిన తపస్సు ద్వారా వచ్చిన ఫలితములో కొంత భాగాన్ని లోక కళ్యాణముకై తర్పణములు వదలుతారు. అటువంటి పుణ్యాత్ముల చుట్టూ వారి తపశ్శక్తి వలయాలు ఎంతో దూరానికి విస్తరిస్తుంటాయి.

ఆ శక్తి వలయాలు వారి తపశ్శక్తినిబట్టి చాలా కిలోమీటర్లవరకు వ్యాప్తి చెందుతుంటాయి. అటువంటి శక్తి తరంగాల పరిధిలోనుండే మనము ఆ ప్రదేశాలలో తిరుగుతుంటాము. వారు ఎవరో మనకు తెలియకపోయినా మన ప్రార్ధనబట్టి వారి అనుగ్రహమును మనము పొందవచ్చును.

ఇప్పుడు పూర్వజన్మ సుకృతముకొద్దీ యీ సాధకుడు ఒక వారముదినములు ఆ పుణ్య క్షేత్రములలో సాధనకై వెళ్ళగలుగుతున్నాడు. స్వామీ రక్ష ! శ్రీరామ రక్ష !!

జై మారుతీ! జై జై మారుతీ !!

.

తేది 20-04-2010 న సుందరదాసు M.S.రామారావుగారి 18వ వర్ధంతి సంధర్భముగా 635వ సుందరకాండ కధాగానముతో నివాళులు!




ఆంధ్ర లోకమును తన సుందరకాండ గానముతో 1975 నుండి
17 సంవత్సరములపాటు ఉర్రూతలూగించిన
' సుందరదాసు M.S.రామారావుగారు '
తన 72వ సంవత్సరములో అనగా తేది 20-04-1992 న
వైకుంఠధామమును చేరారు.

'సుందరకాండ 'అనే పదము వినగానే ఆయనే జ్ఞాపకము వస్తారు.
మృదు మధురమైన
పదములతో రచించడమే కాకుండా

హృదయాలకు హత్తుకునే రాగములతో స్వరపరచి గానము

చేయడము అనన్య సాధ్యమైనది. ఆయన నమ్మిన
'గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి
'

దగ్గరవుండి ఆయనచేత వ్రాయిస్తే గాని అంత ఆకర్షణ రాదు.
'ఇది నిజము!



'రుక్షుడు 'అనే ఆటవికుడు సప్త మహా ఋషుల చేత ' తారక మంత్రము '
ఉపదేశింపబడి వాల్మీకిగా
మారి ' బ్రహ్మదేవుడిచేత ఆదేశించబడి

'సంస్కృతములో రామాయణమును రచించాడు.

ఆదికావ్యమైన ఆ రామాయణము పండితులకే గాని పామరులకు అందలేదు.
అందుచేత 'వాల్మీకినే '
'తులసీదాసుగా' పంపించి అవధి (హిందీ ) భాషలో
రామాయణమును రచింపచేశారు. అదిఉత్తరాదివారికి మాత్రమే అందింది.

తెలుగువారి(మన) పుణ్యము చేత

తులసిదాసుగా అవతరించిన వాల్మీకి
మోపర్తి
సీతారామారావు గా
అవతారమెత్తి

సుందరకాండతో మొదలు పెట్టి (యుద్ధ కాండలో సగము

వరకు ) రామాయణము వ్రాశారు.

ఇది యీ సాధకుని అనుభూతి!


' రాముడు వదలిన బాణములా నూరు యోజనముల
సముద్రమును దాటి లంకకు వెళ్ళి
సీతమ్మను వెతుకుతాను '

అన్న హనుమ ( సుందరకాండలోని )మొదటి మాటలను ప్రేరణగా

తీసుకొని M.S. రామారావుగారు 'శ్రీ హనుమాను గురుదేవులు
నా యెద పలికిన సీతా రామకధా
! నే పలికెద సీతారామకధా !'

అన్నారు. ఇంకా
నలుగురు భక్తితో ఆలకించగా ,

'నలుగురు భక్తితో ఆలపించగా ' అంటూ
యెందరో తన సుందరకాండను గానము
చేసుకోవచ్చును అని తెలిపారు.

అంతే కాదు ఆయన తన స్వ హస్తాలతో యీ సాధకునికి
తేది
11-09-1978 న ఆశీస్సులతో సుందరకాండ పుస్తకమును యిచ్చారు.

గురుదేవులు శ్రీ
ఆంజనేయస్వామి దయతో యీ సాధకుడు

తేది 30-03-1995 న సుందరకాండ కధాగానము
ప్రారంభించి

M.S. రామారావుగారి 18 వ వర్ధంతి నాడు అనగా
తేది 20-04-2010 న తూర్పు
గోదావరి జిల్లాలో ,అనపర్తి మండలములో,

పొలమూరు గ్రామములో, శ్రీ షిరిడీ సాయి మరియు శ్రీ
అయ్యప్ప దేవాలయముల

10 వ వార్షికోత్సవ సంధర్భముగా 635 సుందరకాండ
గానముతో


' సుందర దాసు M.S.రామారావు గారికి నివాళులు


అర్పించగలగడము '
మహద్భాగ్యముగా భావిస్తున్నాడు.



జై మారుతీ! జై జై మారుతీ !!



.