.

బ్రహ్మ దేవుడికే వర్ణింప శక్యము కాని మహిమ గలవాడు శ్రీ ఆంజనేయస్వామి!




అంతర్జాల మితృలకు ' శ్రీ హనుమత్ జయంతి ' సందర్భముగా శుభాభివందనములు!

శ్లోకము : ఆంజనేయ: పూజితశ్చేత్ , పూజితా స్సర్వదేవతా: !

హనుమన్మహిమా శక్యో , బ్రహ్మణాపిన వర్ణితుం !!

భావము : ఆంజనేయస్వామిని పూజిస్తే సమస్త దేవతలనూ పూజించినట్లే ! బ్రహ్మదేవుడు కూడా వర్ణింపజాలని మహిమ హనుమన్మహిమ!!

****

ఆంజనేయుడు పుట్టగానే ఆకలితో సూర్యుడిని చూసి పండు అని భ్రమించి రెండు వేల యోజనముల దూరములో నున్నసూర్యుడిని మ్రింగబోగా దేవేంద్రుడు వజ్రాయుధముతో దవడమీద కొట్టగా దవడ ( హనువు ) వాచిపోయి , స్పృహతప్పివొక పర్వతము మీద పడిపోగా
వాయుదేవునికి దేవేంద్రుడిపై కోపమువచ్చి ఆంజనేయుని వొక గుహలోనికితీసుకుపోయి అన్నిలోకములలోను వాయు గమనాన్ని ఆపివేశాడు. గాలి ఆడక అన్నిలోకములలోని ప్రాణికోటులుఅల్లల్లాడిపోతుంటే దేవేంద్రుడు , బ్రహ్మదేముడితో సహా అందరు దేముళ్ళు దిగి వచ్చి ఆంజనేయుడికి తమ శక్తులన్నీదారపోసి ' నిన్ను పూజిస్తే తమను పూజించినట్టే ' అని మంగళాశాసనము చేశారు. హనువు వాచిపోవడము వలనఅప్పటినుండి ' హనుమ ' అని పిలువబడుతున్నాడు. అందరి దేవతల శక్తులు , ఆశీర్వచనములు పొందిన హనుమ ' సర్వదేవతాస్వరూపుడు ' అయినాడు.

ఆంజనేయుని గొప్పతనము గురించి వర్ణించడానికి బ్రహ్మదేవుడికే శక్యము కానప్పుడు మానవమాత్రులము మనముయేమి చెప్పగలము. అయినా ఉదాహరణకు ఒక్క విషయము చెప్పుకుందాము. శ్రీరామ - రావణ యుద్దముజరుగుతున్నాది. ఇంద్రుడినే జయించిన మేఘనాదుడు (ఇంద్రజిత్తు) తన తండ్రి రావణాసురుడు కన్నాభయంకరమయినవాడు. మాయలతో దొంగయుద్దముతో వానరవీరులను చీల్చి చెండాడుతూ మోహనాస్త్రముతో అందరినీ పడగొట్టాడు. ఇంతలో సూర్యాస్తమయము అవడముతో యుద్దము ఆగింది. రాత్రి విభీషణుడు లాంతరు పట్టుకొని యుద్దభూమిలో ప్రాణాలతో వున్నవారిని గుర్తించేందుకు వెతుకుతున్నాడు. అతనికి జాంబవంతుడుకనిపించాడు. జాంబవంతుడు విభీషణుని చూడగానే ' ఆంజనేయుడు క్షేమమేనా ? ' అని అడిగాడు. విభీషణునికిఆశ్చర్యమువేసి ' తాతా ! నువ్వు శ్రీరాముడిని అడగలేదు. లక్ష్మణుని అడగలేదు. సుగ్రీవుడిని అడగలేదు. అంగదుడిని అడగలేదు. కానియింత మందిని అడగకుండా ముందుగా ఆంజనేయుడిని అడుగుతున్నావు యెందుచేత ?' అని అడిగాడు. అందుకు జాంబవంతుడు ' విభీషణా ! ఆంజనేయుడు ఒక్కడు క్షేమముగా వుంటే నువ్వు యిప్పుడు అడిగినవాళ్ళందరూ క్షేమముగా వున్నట్టే ! ' అన్నాడు. అంటే ఆంజనేయుడు క్షేమముగా వుంటే మనకు నిశ్చింతే అని చెప్పకనే చెప్పాడు.

సాధకుడి నమ్మకము
యేమిటంటే యీ కలియుగములో ఆంజనేయస్వామి చిరంజీవిగా , సజీవముగా , సదేహముతో ఉన్నారు. ఆయన దేవతలందరి తరుపున వారి వారి భక్తులను గుర్తించి ఆ భక్తులకు వారి ఆరాధ్య దైవముల అనుగ్రహమును పొందేటట్టు చేస్తున్నారు. అనగా మనము యే దేముడిని కొలిచినా ఆంజనేయస్వామిని తలిస్తే మన ఆరాధ్య దేముడి అనుగ్రహము త్వరగా వస్తుంది.

ప్రతీ కుటుంభము వారికీ తరతరాలుగా యింటి దేవుడు ఒకరు ఉంటారు.ఆ దేముడిని యేవో పర్వ దినములలో మాత్రమే కాకుండా నిత్యమూ స్మరిస్తుండాలి.వినాయకుడితో మొదలు పెట్టి అందరు దేముళ్ళనూఒక్క సారి తలిచి మన ఆరాధ్య దేముడిని అందరికన్నా యెక్కువ సేపు తలచి ఆంజనేయస్వామిని ఒక్క సారయినాతలవాలి. యీ విధముగా 40 దినములు చేస్తే మన ఆరాధ్య దేముని అనుగ్రహ ధార మనపై ధారాళముగా ప్రవహిస్తుంది.


చాలామంది తమ యింటి దేముడిని ( యిలవేలుపుని ) మార్చివేయడమే కాకుండా మార్చిన దేముడీతోపాటు ఒకరుయిద్దరు దేముళ్ళనే అప్పుడప్పుడు అనగా సంవత్సరములో కొద్ది దినములు మాత్రమే తలుస్తున్నారు.
తర తరాలుగా మన పూర్వులు కొలిచిన ఇలవేలుపుల అనుగ్రహము మన యింటిగుమ్మములోనే ఆగిపోతున్నాది. అంతులేని దైవీ సంపదను- మన పెద్దలను తృణీకరించడము ద్వారా, మన యిలవేలుపును వదలి వేయడము ద్వారాకోల్పోతున్నాము.

...గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి తననే తలచినవారిని తనే నడిపిస్తారు ! ఇది నిజం !

జై మారుతీ! జై జై మారుతీ !!
-
.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి