.

పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలిపిన గోమాతకు చేసిన పూజల యొక్క ఫలితములు.

ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో " నాధా! జనులు పాపములనుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును , తరుణోపాయమును తెలుపమ"ని అడుగగా పరమేశ్వరుడు ఈవిధముగా చెప్పాడు.
పార్వతీ! గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు.
పాదముల యందు - పితృదేవతలు
కాళ్ళ యందు - సమస్త పర్వతములు
భ్రూమధ్యమున - గంధర్వులు
దంతముల యందు - గణపతి
ముక్కున - శివుడు
ముఖమున - జ్యేష్ఠాదేవి
కళ్ళయందు - సూర్య చంద్రాదులు
చెవుల యందు - శంఖు చక్రములు
కంఠమునందు - విష్ణుమూర్తి
భుజమున - సరస్వతి
రొమ్మున - నవ గ్రహములు
వెన్నునందు - వరుణ దేవుడు , అగ్ని దేవుడు
తోక యందు - చంద్రుడు
చర్మమున - ప్రజాపతి
రోమములయందు - త్రింశత్కోటి దేవతలు నివసించెదరు.
అందువల్ల గోమాతను పూజించి పాపములను పోగొట్టుకొని ఆయురారోగ్యములను , అష్టైశ్వర్యములను పొందవచ్చును. గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది. మనసారా నమస్కరిస్తే సమస్త దేవతలకు నమస్కరించినంత పుణ్యము కలుగుతుంది. గోమాతకు ప్రదక్షిణము చేస్తే భూమండలము అంతా ప్రదక్షిణము చేసినంత ఫలము కలుగుతుంది." ---- 1993 స్వాతి వారపత్రికలోని సత్యాన్వేషణ లోనిది.
కర్మభూమి అయిన భారతావనిలో గోవులు అంతరించిపోతున్నాయి. వ్యవసాయ ఆధారిత భూములన్నీ కర్మాగారాలకు నెలవవుతున్నాయి. గోవులు అంతరించిపోతున్నాయి. నదీ పరివాహిక ప్రాంతాలలోనే గోవులు కనిపిస్తున్నాయి. అరణ్యాలలో వుండి గ్రామాలమీద పడి పశువులను ,మనుష్యులను తినివేసే పులులు అంతరించిపోతున్నాయని వాటిని అభయారణ్యాలలో రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వమువారికి గోవుల ఆక్రందనలు వినిపించడము లేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి ఆవులు ,యెద్దులు అంతరించిపోతున్నా యెవరికీ చీమైనా కుట్టడము లేదు. జై మారుతీ! జై జై మారుతీ!!
స్వామి రక్ష! శ్రీ రామ రక్ష!!
శ్రీ రామ రక్ష! సర్వ జగద్రక్ష !!

.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి