.

దేముడి అడుగుజాడలు


అనంత సాగర తీరం మీద ' మనిషి ' నడుస్తున్నాడు. వేల మైళ్ళు గడచినా తరగని ప్రయాణము. అప్పుడప్పుడు వెనుతిరిగి తాను నడిచిన త్రోవను చూస్తున్న మనిషికి ఆశ్చర్యము అనిపించింది. కారణం.? ...దారిపొడవునా మనిషికి రెండు జతల కాలి జాడలు కనిపించాయి. సముద్ర తీరముమీద రెండు జతల కాలి జాడలను చూసిన మనిషి .. .' నాతో పాటు దేముడు కూడా నడుస్తున్నాడు. ఆయనవే ఈ పాద ముద్రలు ' అనుకున్నాడు

కొంత దూరము తర్వాత మనిషికి కష్టాలు యెదురయ్యాయి. .. బాధలు భయపెట్టాయి... నీరసము ఆవహించింది... నిస్పృహ అమలుకొంది... తూలిపోతూ నడక సాగించిన మనిషి ...తాను నడుస్తున్నాననే స్పృహకూడా కోల్పోయాడు. అలాంటి స్థితిలో మనిషి మళ్ళీ వెనుతిరిగి చూశాడు. అప్పుడు కేవలం ఒక్క జత పాద ముద్రలే కనిపించాయి. దేముడినే పూర్తిగా నమ్ముకొని ఉన్నా కష్ట సమయములో దేముడు తనతో నడవడము లేదనీ , తన రక్షణను గాలికి వదలేశాడనీ మనిషి బాధ పడ్డాడు.

అంత వరకు అదృశ్యంగా అతనితో పాటే నడచిన దేముడు ప్రత్యక్షమయ్యాడు. ' ఆనందంతో ఆరోగ్యంతో నడిచినంత వరకు తాను అతనితోపాటే నడిచాననీ , కళ్ళు తిరిగి తూలిపోయిన మరు క్షణములో మనిషిని తన చేతులతో యెత్తుకొని నడుస్తున్నాననీ , ఇప్పుడు కనిపిస్తున్న ఒక్క జత అడుగుజాడలు తనవేననీ ' దేముడు చెప్పాడు.

....... కరిగి కన్నీరయిన మనిషి దేముడి పాదాలను చుట్టుకున్నాడు.

(----- తేది 17-01-1999 ఆదివారము ఈనాడు లొని 'ఇది కధ కాదు ' సౌజన్యముతో .)

******

గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయతో 634 సుందరకాండ కధాగానము.

తేది 17-04-2010 శనివారము విశాఖపట్నములో , సీతమ్మధార వద్ద , H.B. కోలనీలో , గాయత్రీ దేవి ఆలయ సమీపములో , లక్ష్మీ అపార్టుమెంట్సు యెదురుగా D.no. 55-23-57 లో గల శ్రీ V రాఘవరావు గారి యింటిలో యీ సాధకునిచే 'అభినయ పూర్వక , వ్యాఖ్యాన సహిత 634 సుందరకాండ కధాగానము ' సాయంత్రము 6.00 గంటలకు ప్రారంభింప బడును.

శ్రీ రామ శ్శరణం మమ !!
.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి