.

శ్రీ రామ కోటి స్థూపము నిర్మాణ దశలో ఉన్నది



            

   ఆరాధనతో ,సర్వ సమర్పణముతో ,నిరాడంబరముగా    సాగుతున్న యీ సాధకుని ఆధ్యాత్మిక జీవనములో భగవదనుగ్రహముతో   ఎన్నో నిదర్శనములు కలిగినవి.

     గురుదేవులు శ్రీ అంజనేయస్వామి దయతో ఇంత వరకు యీ సాధకుడు భక్తులచే వ్రాయించి సేకరించిన శ్రీరామ నామములలో 13కోట్లు స్థూపముయందు, శ్రీరామ ఆలయ ప్రతిష్టాపనలయందు, 25 అడుగుల   శ్రీ ఆంజనెయస్వామి హ్రుదయస్థానమందు నిక్షిప్తము చేయబడినవి.
   ఇంకా 7కోట్లు  శ్రీరామనామములు ఉన్నవి. ఈ శ్రీరామనామములు యే విధముగా కైంకర్యము అవుతాయో అని ఎదురు చూస్తున్న యీ సాధకునికి  పూజ్యులు శ్రీ సి మోహనరెడ్డిగారు ఫోను చేయడమువలన  యీ సాధకుడు ఏ రాముని సన్నిధిలో ఆధ్యాత్మిక జీవనము ప్రారంభించి సాధన చేశాడో  అరాముని సన్నిధిలో నిర్మితమౌతున్న స్థూపమునందు కైంకర్యము అవడము భగవంతుని ఉనికిని తెలియజేయడమే  అవుతున్నది కదా !
  అంతే కాదు వార్తా పత్రికల ద్వారా భక్తులకు తెలియడము వలన యీ రోజు  ఇప్పటికి మొత్తము    13కోట్లు   సేకరించబడినవి. మరి యీ రామ కార్యము భగవత్సంకల్పము వలననే కదా!!
     ఈ యఙ్ఞములో , ఈ తపస్సులో మీరూ భాగస్తులు అవండి! తేదీ  10-02-2013 లోగా మీరు వ్రాసిన శ్రీరామనామములు పంపించండి!
                                                                                               ----భగవత్భాగవతదాసుడు

                                                                                                    కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్
 
.

1 కామెంట్‌లు:

voleti చెప్పారు...

రామ కోటి ప్రతులను ఏ విధముగా స్థూపములో నిక్షిప్తము చేస్తారో కాస్త వివరించగలరు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి