తేది 16-03- ౨౦౧౦ మంగళవారము , ఉగాది పర్వదినము సందర్భముగా ముందుగా నిర్ణయించుకున్నట్టుగా సకలదేవతా స్వరూపుడయిన శ్రీఆంజనేయస్వామి [యీ సాధకుడు తీసుకువెళ్ళిన] విగ్రహమునకు -- అభ్యంగ స్నానము చేసి శుచి అయిన వస్త్రములు ధరించి వచ్చిన వారికి , పాంట్ కాకుండా పంచె ధరించి వచ్చిన మగవారికి , భక్తులందరిచేత స్వయముగా అభిషేకములు చేసుకునే అవకాశము కల్పించబడినది. ఈ అపూర్వమయిన అవకాశమును 52మంది దంపతులు సద్వినియోగపరచుకొని సుమారు 130కొబ్బరికాయల జలముతో అభిషేకములు చేసుకొనడమే కాకుండా అభిషేకము చేసుకున్న ప్రతీ 2 కొబ్బరికాయలకు ఒక శ్రీ ఆంజనేయస్వామి రాగి ముద్రికను యెటువంటి రుసుము చెల్లించకుండా పొందారు. వాద్యముల సహకారముతో యీ సాధకుడు పలు రాగములలో శ్రీ హనుమాన్ చాలీసాను ఉత్తేజముగా ఆరాధనతో గానము చేస్తుండగా వందలాది భక్తులు కలసి పాడినారు. అందరికీ హనుమాన్ చాలీసా పుస్తకములు యివ్వబడినవి. 'సామూహిక హనుమాన్ చాలీసా గాన యజ్ఞము ' లో భాగముగా నిర్వహించబడిన యీ కార్యక్రమము కార్యవర్గము వారికి నచ్చి మళ్ళీ చేయగలరా అని యీ సాధకుడిని అడిగారు. సామూహిక శ్రీ రామ కోటి లిఖిత జప యజ్ఞము లో భాగముగా ఆసక్తి గల భక్తులందరికీ 1008 శ్రీ రామనామములు పట్టే పుస్తకములు అందజేయబడినవి. శ్రీ రామనామములను వ్రాసి తెచ్చిన వారికి శ్రీ రక్షా బంధన్ లు యివ్వబడును. మొదటి రోజున వచ్చిన వందలాది భక్తులందరికీ శ్రీఆంజనేస్వామి రక్షాబంధన్ లు యివ్వబడినవి. రేపు సుందరకాండ కధా గానము ప్రారంభింపబడుతుంది. రేపటి కార్యక్రమములో ఆంజనేయస్వామి లంకిణిని జయించిన సన్నివేశమునకు చక్కెర పొంగలి నివేదన చేసి ప్రసాదముగా వితరణ చేయబడును. మహా మహోపాద్యాయులు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారి సూచనల ప్రకారము సుందరకాండలో నివేదనలు చేయబడుతున్నవి.
యత్ర యత్ర రఘునాధ కీర్తనం -
తత్ర కృతమస్తకాంజలిం -
బాష్ప వారి పరపూర్ణలోచనం-
మారుతిం నమత రాక్షసాంతకం.
తత్ర కృతమస్తకాంజలిం -
బాష్ప వారి పరపూర్ణలోచనం-
మారుతిం నమత రాక్షసాంతకం.
శ్రీ రామజయం.
.









1 కామెంట్లు:
శ్రీ కొమ్మూరు ఉమా ప్రసాద్ భాగవతార్ గార్కి
అయ్యా!
ఈరోజు మీ బ్లాగు శ్రీ నరసింహ మూర్తి గారు, నేను కలిసి చూసేము. బహుశా మీరు 17-3-2010 నాడు ప్రచురించిన బ్లాగు. చాలా ముచ్చటగా చూడముచ్చటగా మాకు యిరువురకు మనోరంజకంగా నున్నది. చాలా సంతోషించినాము. మీకు మా ధన్యవాదములు.
కొడవంటి సుబ్రహ్మణ్యం
కామెంట్‌ను పోస్ట్ చేయండి