నిత్య పూజ సద్గురువు. ( 1 వ భాగము ) నిజమైన గురువు ఎవరో ఆ సద్గురువుని లక్షణాలెటువంటివో తెలుసుకోవడము అందరికీ అవసరము. ముఖ్యముగా ఆధ్యాత్మిక సాధకులకూ , ఆత్మ జిజ్ఞాసులకూ ఎంతో శ్రేయస్కరము. వేదాంత శాస్త్రాలలో " గురు " అనే పదానికి అర్ధము యీ విధముగా చెప్పబడింది.
శ్లోకము : గు కార స్త్వంధకారోస్తు రు కార స్తన్నిరోధక : ! అంధకార నిరోధత్వం గురు రిత్యభిధీయతే !! తాత్పర్యము
: 'గు ' అనే పదము అజ్ఞానమనే అంధకారాన్ని సూచించేదని , 'రు ' అనే పదము దానిని నిరోధించేదని , అంధకారాన్నినిరోధించేది కనుక 'గురు ' అనగా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడని అర్ధము.
77777 సద్గురువుని గురించి 'యోగ వాశిష్టంలో ' యిలా స్పష్టము చేయబడింది.
శ్లోకము : దర్సనా త్స్పర్శనా చ్చబ్దా త్కృపయా శిష్య దేహకే , జనయే ద్య: సమావేశం శాంభవం స హి దేశిక: ! తాత్పర్యము
: దర్శనము వలనా , స్పర్శ చేతా , కృపా కటాక్షములతో కూడిన ప్రబోధ వాక్యముల వలనా , శిష్యుని హృదయమందు శివ జ్ఞానపరమైన ఆత్మతత్వ సమావేశమును ఎవరు జనింపజేయగలుగునో , అటువంటి మహనీయుడే నిజమైన సద్గురువు.
%%%%%%% శ్లోకము : సర్వే శృణుత భద్ర వో నిశ్చయేన సునిశ్చితం , ఆత్మ జ్ఞానా త్పరం నాస్తి గురో రపి చ తద్విధ: ! తాత్పర్యము
: ఓ జనులారా ! మీకు శుభము కలుగు గాక ! మీరందరూ అత్యంత నిశ్చయమైన , పరమ సత్యమైన ఈ మహత్తర విషయమును వినుడు. " ఆత్మ జ్ఞానము కంటెను , ఆత్మ జ్ఞాన అనుభవజ్ఞుడైన సద్గురువు కంటెను మించినది ఈ లోకమందేదియును లేదు "
@@@@@@ శ్లోకము : పద వాక్య ప్రమాణజ్ఞై ర్దీపభూతై: ప్రకాశితం , బ్రహ్మ వేద రహస్యం యై స్తా న్నిత్యం ప్రణతో స్మ్యహం ! ( ఉ
.పా
) తాత్పర్యము
: వేదాంత మహావాక్య ప్రమాణాల్ని సంపూర్ణముగా ఎరిగిన వాడవడము వలన , దీపము వస్తువుల్ని ఎలా ప్రకాశింపజేస్తుందో , అలా వేద రహస్యమైన బ్రహ్మ స్వరూపాన్ని ప్రకాశింపజేసి , శిష్యునికి గోచరిన్పజేసె సద్గురు మహనీయునికి సర్వదా ప్రణామములు అర్పించుచున్నాను. ()()())()
గురుని ఆవశ్యకత : ఆత్మ జ్ఞాన సంపన్నుడైన గురువు ముఖమున స్వయముగా బ్రహ్మవిద్యను అభ్యసించాలని , సద్గురుని అనుభవైక ప్రబోధాలవల్లకాక , కేవలము శాస్త్ర ప్రమాణముల చేత నేర్చుకున్న విద్య ఫలప్రదము కాదని , ఆత్మవేత్తలైన సద్గురువుల వల్ల నేర్చుకున్న విద్యయే సుస్థిరమైన ,ఫలప్రదమైన ఆధ్యాత్మిక ప్రగతిని కలుగ జేస్తుందని శృతులలో చెప్పబడింది. అయితే పక్వ జీవులైన కొందరు మహనీయులు పూర్వ జన్మ సుకృతమువలన ఏ గురువునూ ఆశ్రయించకనే , సక్రమమైన స్వకీయమైన పురుష ప్రయత్నము చేసుకొని , ఆత్మ సిద్ధిని పొందడము కూడా గమనార్హము. అటువంటివారికి వారి ఆంతర్యములోవున్న పరమాత్మ స్వరూపుడే తోడ్పడుతూ , ఆధ్యాత్మిక ప్రగతినీ , ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంటాడు. { జనవరి 1994 సప్తగిరి సౌజన్యముతో. } &&&&&
ఎటువంటివాడు గురువు ? * వ్యక్తులలో అంతర్లీనముగా ఉన్న చైతన్య శక్తులను జాగృతం చేసి కర్మాచరణకు స్పూర్తిని యిచ్చేవాడు - గురువు
! * వారిలోని చొరవను , సృజనాత్మకతను వ్యక్తపరచడానికి తగిన మార్గము చూపేవాడు - గురువు
! * దిక్కుతోచక , దిగులుతో బాధపడుతున్నప్పుడు ధైర్యము చెప్పి ముందుకు నడిపించేవాడు - గురువు
! * తమలోని దివ్యత్వాన్ని దర్శించి , ఆచరణలొ ధార్మికతగా దానిని అమలుపరచగల ధీమంతులుగా వ్యక్తులను తీర్చిదిద్దే దార్శనికుడు - గురువు
! ( మార్చి/ 2002 భక్తి నివేదన సౌజన్యముతో ) సద్గురువు. ( 1 వ భాగము ) నిజమైన గురువు ఎవరో ఆ సద్గురువుని లక్షణాలెటువంటివో తెలుసుకోవడము అందరికీ అవసరము. ముఖ్యముగా ఆధ్యాత్మిక సాధకులకూ , ఆత్మ జిజ్ఞాసులకూ ఎంతో శ్రేయస్కరము. వేదాంత శాస్త్రాలలో " గురు " అనే పదానికి అర్ధము యీ విధముగా చెప్పబడింది. శ్లోకము : గు కార స్త్వంధకారోస్తు రు కార స్తన్నిరోధక : ! అంధకార నిరోధత్వం గురు రిత్యభిధీయతే !! తాత్పర్యము : 'గు ' అనే పదము అజ్ఞానమనే అంధకారాన్ని సూచించేదని , 'రు ' అనే పదము దానిని నిరోధించేదని కనుక 'గురు ' అనగా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడని అర్ధము. 77777 సద్గురువుని గురించి 'యోగ వాశిష్టంలో ' యిలా స్పష్టము చేయబడింది. శ్లోకము : దర్శనా త్స్పర్శనా చ్చబ్దా త్కృపయా శిష్య దేహకే , జనయే ద్య: సమావేశం శాంభవం స హి దేశిక: ! తాత్పర్యము : దర్శనము వలనా , స్పర్శ చేతా , కృపా కటాక్షములతో కూడిన ప్రబోధ వాక్యముల వలనా , శిష్యుని హృదయమందు శివ జ్ఞానపరమైన ఆత్మతత్వ సమావేశమును ఎవరు జనింపజేయగలుగునో , అటువంటి మహనీయుడే నిజమైన సద్గురువు. %%%%%%% శ్లోకము : సర్వే శృణుత భద్ర వో నిశ్చయేన సునిశ్చితం , ఆత్మ జ్ఞానా త్పరం నాస్తి గురో రపి చ తద్విధ: తాత్పర్యము : ఓ జనులారా ! మీకు శుభము కలుగు గాక ! మీరందరూ అత్యంత నిశ్చయమైన , పరమ సత్యమైన ఈ మహత్తర విషయమును వినుడు. " ఆత్మ జ్ఞానము కంటెను , ఆత్మ జ్ఞాన అనుభవజ్ఞుడైన సద్గురువు కంటెను మించినది ఈ లోకమందేదియును లేదు " @@@@@@ శ్లోకము : పద వాక్య ప్రమాణజ్ఞై ర్దీపభూతై: ప్రకాశితం , బ్రహ్మ వేద రహస్యం యై స్తా న్నిత్యం ప్రణతో స్మ్యహం ! ( ఉ .పా ) తాత్పర్యము :వేదాంత మహావాక్య ప్రమాణాల్ని సంపూర్ణముగా ఎరిగిన వాడవడము వలన , దీపము వస్తువుల్ని ఎలా ప్రకాశింపజేస్తుందో , అలా వేద రహస్యమైన బ్రహ్మ స్వరీపాన్ని ప్రకాశింపజేసి , శిష్యునికి గోచరింపజేసే సద్గురు మహనీయునికి సర్వదా ప్రణామములు అర్పించుచున్నాను. గురుని ఆవశ్యకత : ఆత్మ జ్ఞాన సంపన్నుడైన గురువు ముఖమున స్వయముగా బ్రహ్మవిద్యను అభ్యసించాలని , సద్గురుని అనుభవైక ప్రబోధాలవల్లకాక , కేవలము శాస్త్ర ప్రమాణముల చేత నేర్చుకున్న విద్య ఫలప్రదము కాదని , ఆత్మవేత్తలైన సద్గురువుల వల్ల నేర్చుకున్న విద్యయే సుస్థిరమైన ఫలప్రదమైన ఆధ్యాత్మిక ప్రగతిని కలుగ జేస్తుందని శృతులలో చెప్పబడింది. అయితే పక్వ జీవులైన కొందరు మహనీయులు పూర్వ జన్మ సుకృతమువలన ఏ గురువునూ ఆశ్రయించకనే , సక్రమమైన స్వకీయమైన పురుష ప్రయత్నము చేసుకొని , ఆత్మ సిద్ధిని పొందడము కూడా గమనార్హము. అటువంటివారికి వారి ఆంతర్యములోవున్న పరమాత్మ స్వరూపుడే తోడ్పడుతూ , ఆధ్యాత్మిక ప్రగతినీ , ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంటాడు. { జనవరి 1994 సప్తగిరి సౌజన్యముతో. } &&&&& ఎటువంటివాడు గురువు ? * వ్యక్తులలో అన్యర్లీనముగా ఉన్న చైతన్య శక్తులను జాగృతం చేసి కర్మాచరణకు స్పూర్తిని యిచ్చేవాడు - గురువు ! * వారిలోని చొరవను , సృజనాత్మకతను వ్యక్తపరచడానికి తగిన మార్గము చూపేవాడు - గురువు ! * దిక్కుతోచక , దిగులుతో బాధపడుతున్నప్పుడు ధైర్యము చెప్పి ముందుకు నడిపించేవాడు - గురువు ! * తమలోని దివ్యత్వాన్ని దర్శించి , ఆచ్రణలో ధార్మికతగా దానిని అమలుపరచగల ధీమంతులుగా వ్యక్తులను తీర్చిదిద్దే దార్శనికుడు - గురువు ! ( మార్చి/ 2002 భక్తి నివేదన సౌజన్యముతో ) నిత్యపూజ - గురు వందనం 2వ భాగము. శ్లోకము : నారాయణ సమారంభాం - శంకరాచార్య మధ్యమాం ! అస్మద్గురు పర్యంతం - నమామి గురు పరంపరాం !! తాత్పర్యము : 'నారాయణుని నుండి శంకరాచార్యుని వరకు , మళ్ళీ ఆయన చెప్పిన ధర్మాన్నే మనకు చెప్పిన మన గురువుగారి వరకూ ఉన్న గురుపరంపరకు నమస్కారములు ' (మనది శాశ్వతమైన సనాతన ధర్మము. దీనికి భగవానుడైన నారాయణుడు ఆది గురువు .ఆయన నుండి బ్రహ్మ , బ్రహ్మ నుండి వశిష్టుడు , వశిష్టుని నుండి శక్తి , శక్తినుండి పరాశరుడు , పరాశరుడి నుండి వ్యాసుడు , వ్యాసుని నుండి శుకుడు , శుకుని నుండి గౌడపాదుడు , గౌడపాదుడి నుండి గోవింద భగవత్పాదుడు , గోవింద భగవత్పాదుని నుండి ఆదిశంకరాచార్యులు సనాతన వేద ధర్మాన్ని స్వీకరించారు. ఆ సనాతన ధర్మాన్ని ఉపదేశించి మనలను ఆధ్యాత్మిక మార్గములో నడిపించే గురువే గురువు.) శ్లోకము : గురవో నిర్మలా శాంతా: - సాధకా మిత భాషణ: ! ఏతై: కారుణ్యతో దత్తో - మంత్ర: క్షిప్రం ప్రసీదతి !! తాత్పర్యము : గురువులనగా నిర్మలమైన వారు , శాంత స్థితి కలవారు , సాధకులగువారు , మితభాషులగువారు. అట్టి వారిచే దయతో ఈయబడు మంత్రము వెంటనే అనుగ్రహించ గలదు. 909090 శ్లోకము : నిత్యాయ నిర్వికల్పాయ - నిరవద్యాయ యోగినే ! నిర్మలాయ గిరీశాయ - శివాయ గురవే నమ : తాత్పర్యము : నిత్యుడు , పొరపాటు అనునది లేనివాడు , ఆక్షేపణ లేనివాడు, చిత్తవృత్తులను నిరోధించిన వాడు , నిర్మలుడు , బృహస్పతి సముడు , మంగళ స్వరూపుడు అగు గురువునకు నమస్కారము. శ్లోకము : శరణం సద్గురు చరణం - నిగమాభరణం భవాబ్ది సంతరణం ! యత్పరిచరణం కరణం - అనిష్ట నివృత్తే రభీష్టాస్తే : !! ( నవంబరు 1999 వేదాంతభేరి సౌజన్యముతో ) తాత్పర్యము : వేదవేత్తలగు సద్గురువుల పాదపద్మములే జనులకు శరణ్యము. సంసార సముద్రమును అయ్యవి అవలీలగా దాటించివేయగలవు. అనగా గురుభక్తి కలవారు , దైవభక్తి కలవారు , సంసార సాగరమును సులభముగా దాటివేయగలరు. కాబట్టి అనిష్టమగు బంధము యొక్క నివృత్తి కొరకును , అభీష్టమగు మోక్షము యొక్క ప్రాప్తి కొరకును జనులు గురుదేవుల పాదపద్మములను తప్పక ఆశ్రయించవలెను. %%%%%% శ్లోకము : అజ్ఞాన తిమిరాంధస్య - జ్ఞానాంజన శలాకయా ! చక్షు రున్మీలితం యేన - తస్మై శ్రీ గురవే నమ : !! తాత్పర్యము : అజ్ఞానమనే అంధకారముతో మూసుకుపోయిన నా కళ్ళను జ్ఞానాంజనమనే దీపముతో వెలుగులోనికి తెచ్చిన నా గురుదేవులకు నమస్కారము. ()()()() శ్లోకము : యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో యస్యాప్రసాదా న్న గతి : కుతో అపి ! ధ్యాయం స్తువం సస్య యశ స్త్రి సంధ్యం వందే గురో : శ్రీ చరణారవిందం. !! తాత్పర్యము : ఆధ్యాత్మిక ఆచార్య్ని అనుగ్రహము వలన భగవంతుని అనుగ్రహము లభిస్తుంది. ఆయన అనుగ్రహము లేకపోతే ఏ వ్యక్తీ ముందుకు సాగలేడు. అందుచేత నేను నిరంతరము నా ఆధ్యాత్మిక ఆచార్యుణ్ణి కనీసము మూడు పర్యాయములు స్మరిస్తూ ఆయన చరణారవిందములకు ప్రణమిల్లుతాను. నిత్యపూజ
- గురు
శబ్దోచ్చారణ
మాహాత్మ్యం
.
'గురు
' శబ్దంలో
'గ
' కారం
, 'రేఫ
' , ' ఉ
'
కారమనే
మూడు
వర్ణాలు
ఉన్నాయి
. వీటిలో
'గ
' కారము
-
సిద్ధి
ప్రదాయకము
. ' రేఫ
'- పాప
హారకము
. ' ఉ
' కారము
- శివ
స్వరూపము
. కనుక
'గురు
' అనే
శబ్దాన్ని
ఉచ్చరిస్తే
కోరికలు
సిద్ధించడము
, పాపాలు
హరించడము
, శివానుగ్రహమనే
మూడు
ఫలితాలు
ఒకే
సమయములో
దక్కుతాయి
. ఇదీ
గురు
శబ్దోచ్చారణ
మహాత్మ్యం
!
ఎవరు
ఇతర
జీవుల
పట్ల
ద్వేషము
లేక
, స్నేహ
మమకారములు
కలిగివుందురో
, ఎవరు
క్షమా
గుణము
కలిగి
ఉందురో
, ఎవరు
సుఖ
దు
:ఖములను
, సమానముగా
చూడగలరో
వారు
పరమాత్మకు
యిష్ఠులు
!
.