శ్లోకం :- యత్రాస్తి భోగో - నహి తత్ర మోక్ష :
యత్రాస్తి మోక్షో- నహి తత్ర భోగ: !
శ్రీ మారుతేస్సేవన తత్పరాణాం
భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ !!
భావము : ఎచ్చట భోగము ఉండునో అచ్చట మోక్షము ఉండదు. ఎచ్చట మోక్షము ఉండునో అచ్చట భోగము ఉండదుకాని ఆంజనేయ సేవా తత్పరులకు భోగము,మోక్షము రెండును సిద్దించును.
అనగా భోగమును యిచ్చే పరమేశ్వరుడు మోక్షమును యివ్వలేడు. అలాగే మోక్షమును యిచ్చే శ్రీరాముడు(శ్రీమన్నారాయణుడు)భోగమును యివ్వలేడు.
ఇంకా చెప్పాలంటే శ్రీరాముడిని గాని, శ్రీకృష్ణుని గాని, శ్రీవేంకటేశ్వరుడిని గాని లేదా పరమేశ్వరుడిని గాని పూజించేవారు ఆంజనేయస్వామి ద్వారా వారిని పూజిస్తే ఈశ్వరాంశ సంభూతుడైన మరియు శ్రీరామదాసుడైన ఆంజనేయస్వామి భక్తుల చిన్న చిన్న కోర్కెలు తీర్చడమే కాకుండా వారికి భోగమును మరియు మోక్షమును కూడా యిప్పించగలడు కనుక తులసిదాసు గారి అవధి( హిందీ) భాషలోని శ్రీ హనుమాన్ చాలీసాను ప్రతీ అక్షరమును స్పష్టముగా పలుకుతూ పారాయణ చేసుకోండి.
జై మారుతీ ! జై జై మారుతీ !!
.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి