నిత్య పూజ --పితృదేవతలు అమరులే !
పితృదేవతలు అందరూ అమరులవంటివారే! అయితే దేవతలు ఉత్తర దిశలో నివసించుచున్నారు. పితరులు దక్షిణ దిశలో తమ నివాసమును యేర్పరచుకున్నారు. పరమపదించిన బాంధవులకు అతి భక్తితో శ్రాధ్ధకర్మలు ఆచరించినందువల్ల పితరులకు అమిత ఆనందము కలుగుతున్నాది. అందువల్ల పితృదేవతలు శ్రాధ్ధకర్మలు ఆచరించిన వారికి అందరికీ ఐహిక సుఖాలే కాక ఉత్తమమైన పుణ్యగతిని ప్రసాదిస్తున్నారు. మానవులకే కాక సుర , అసుర , గరుడ , గంధర్వ , యక్ష , కిన్నెర , కింపురుషాదులు అందరికీ పితృదేవతలు పూజనీయులే !
%%%%%%%%%%%%
మానవుల - పితృదేవతల - దేవతల కాలమానము.
మానవుల యొక్క శుక్లపక్షము [ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ] పితృదేవతలకు ఒక పగలు , కృష్ణపక్షము [ పాడ్యమి నుండి అమావాస్య వరకు ] ఒక రాత్రి. అనగా మానవులకు ఒక మాసము పితృదేవతలకు ఒక దినము అగును. అందుచేతనే ప్రతీ అమావాస్య నాడు పితృతర్పణము , పిండ ప్రదానము చేయుటకు కారణము. మరణించిన పిదప ఒక సంవత్సరము వరకు ప్రతీ నెలా అమావాస్య నాడు చేసే పితృతర్పణము పితృదేవతలకు నిత్యమూ [ ప్రతీ దినము ] అన్నమిడినట్లుండును.
మానవుల యొక్క ఉత్తరాయణపు ఆరు మాసములు దేవతలకు ఒక పగలు , దక్షిణాయపు ఆరు మాసములు ఒక రాత్రి. అనగా మానవులకు ఒక సంవత్సర కాలము దేవతలకు ఒక దినము. అందుచేతనే సంవత్సరమునకు ఒక పర్యాయము ఉత్సవములు జరుపుతున్నారు. ఆ విధమగా చేయుట వలన దేవతలకు నిత్యము [ప్రతీ దినము ] పూజా జరిపించినట్లుండును.
.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి