* భగవంతుని యొక్క నామసంకీర్తనములో నీవు పాల్గొనుట వలన అచేతనముగనే నీయందు ప్రభునామ విద్యుచ్చక్తి ప్రవేశించి నీకు ఎనలేని ఆనందము కలిగించును.
* భగవన్నామము చేయునప్పుడు రధము వంటి నీ మనస్సు కోరికలనెడి వందలాది అశ్వములచే లాగబడినప్పటికీ తిరిగి భగవన్నామమనెడు కళ్ళెములచే బంధింపబడును. అందువలననే నీవు జపమాలను ఉపయోగించవలెను.
* అమృతతుల్యమైన " కృష్ణ" నామమును వీడకుము. ప్రాకృతమైన విధులను శ్రద్ధా భక్తులతో పూర్తిచేయుట నీ ధర్మము. ఈ ధర్మమును నిర్వర్తించి అవకాశము కలిగినప్పుడు ప్రభునామ జప , సంకీర్తన , గోష్ఠులలో కాలము గడుపుము. నీవు పొందు ఆనందము విలువ కట్టలేనిది.
* భగవన్నామము వలన సర్వులు ప్రేమమయులై మనవారు అగుదురు. మనము "ఆ జగత్ప్రభువుని వారగుదుము " . ఏ మతము యొక్క సారాంశమైననూ భగవన్నామమే ! భగవనామమును గురించి చెప్పని మతము లేదు.
* నామమును నామమాత్రముగా స్వీకరించకు. నీవు గ్రహించు నామము భగవంతునిది అని గ్రహించి నీ మనస్సు దానియందు లగ్నము చేయుము.
* భగవనామమనెడి విత్తనముచే సత్యగుణమనే మొక్క మొలిచి భక్తియనెడు ఫలము పొందగలము. భక్తి యనెడు మధుర ఫలము వలన ప్రేమ కలుగును. అదియే ప్రేమ స్వరూపమగు ప్రభువు అని గ్రహింపుము.
* భగవన్నామే ఒక మహా మంత్రమైనప్పుడు మరింకేవో మంత్రములున్నవని అనుకొనుట మన మనోదౌర్బల్యము.
* నామ సంకీర్తన నామ జపము వలన నీయందు నిష్కామ ప్రేమ జనించి భగవత్ సాక్షాత్కారము కలుగును.
-- శ్రీ కుసుమ హరనాధ ప్రభు .
( తేది 20-09-96 స్వాతి సపరివార పత్రిక సౌజన్యముతో )
--- తేది 10-04-2010 సాయంత్రము విశాఖ లో m.v.p. కోలనీలో పైలాను నుండి d.r.d.a. ఆఫీసు త్రోవలో సాయి కృప అపార్టుమెంటులో శ్రీమతి ఇందిర గారి గృహములో 633 వ సుందరకాండ కథా గాన కార్యక్రమము సాయంత్రము 6.30 గంటలకు ప్రారంభమవును.
జై మారుతీ ! జై జై మారుతీ !!
.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి