.

good friday శుభ శుక్రవారము.--గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక !

గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక !

నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక !
నీ శతృవులకు నీ నామమును తెలియజేయుటకై .... అగ్ని - పొదలను కాల్చు రీతిగాను, నీళ్ళను పొంగజేయు రీతిగాను ...

నీవు దిగి వచ్చుదువు గాక !

జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక !


నీవు దిగి వచ్చెదవు గాక !


తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి దేవునిని ఎవడు కాలమునా చూచియుండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు.


గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక !


-- యెషయా 64: 1-4

***

మేమందరము అపవిత్రులవంటి వారమయితిమి.
మా నీతి క్రియలన్నియు మురికి గుడ్డ వలెనాయెను.
మేమందరము ఆకువలె మాడిపోతిమి.
గాలివాన కొట్టుకొని పోవునట్టుగా మా దోషములు మమ్ము కొట్టుకొని పోయెను.
నీ నామమను పట్టి మొరపెట్టు వాడొకడును లేక నిన్ను ఆధారము చేసికొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకొను వాడొకడున్ లేడు.


--యెషయా 64: 6-8

[తేది 05-07-1996 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక లోని ' అభిమతము ' సౌజన్యముతో ]

మాతృ దేవో భవ ! పితృదేవో భవ !! ఆచార్య దేవో భవ !!!

---- కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్
.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి