.

నిత్య పూజ --గురువు సహాయము కోరు!

నిత్య పూజ --గురువు సహాయము కోరు! గురువును సహాయము కోరు గురువు లేని ప్రయాణము ప్రమాదభరితమయినది. సద్గురు సహాయము లేకుండా మనస్సును జయించగలవాడు యెవ్వడు ? వలదిక ఇలలో ఇసుమంతైననూ సందేహం గురువు లేనిదే దుర్లభమోయీ భవతరణం ! గురువు వినా రుద్రాక్షలు దండగ ! గురువు వినా దనమ్ములు దండగ ! గురువు వినా ప్రతీయత్నము దండగ ! ఉందీ సత్యం పురాణాల నిండుగ !! గురువు లక్షణాలు ! పరోపకార భావన , జప పూజాదుల ఆచరణ , సార్ధకమయిన పలుకు , శాంత స్వభావము , వేద వేదాంగాలు క్షుణ్ణంగా తెలిసి యుండుట , యోగ శాస్త్ర సిద్దాంతాలను సులువుగా బోధించగలుగుట , దేవతల మనస్సులను సంతోష పెట్టగలిగియుండుట మొదలయిన సుగుణాలతో పరిపూర్ణుడైన వాడే సద్గురువు ! ఇంతే కాదు సర్వ విధి సామర్ధ్యము మంచి మాటకారితనము , చక్కని తేజస్సు , దాన గుణము , పరిశుద్దమయిన మనస్సు , పృధివి మొదలైన పంచ భూతాల తత్వము ఎరిగి వుండుట మొదలైన లక్షణాలు కలిగియున్న వ్యక్తి సద్గురువు !
.

1 కామెంట్‌లు:

B.Rathnam చెప్పారు...

ఆత్మ నాకు బాగా తెలుసని భావించడం లేదు; తెలియదనీ భావించడం లేదు. ఎందుకంటే నన్ను గురించి నాకు తెలుసు. 'ఆత్మను గురించి తెలియదు. అదే సమయంలో తెలియదని చెప్పడమూ సాధ్యం కాదు, అని మనలో ఎవరు అనుకొంటారో అతడే ఆత్మ ను గ్రహించినవాడు

కామెంట్‌ను పోస్ట్ చేయండి