ఆంధ్ర లోకమును తన సుందరకాండ గానముతో 1975 నుండి
17 సంవత్సరములపాటు ఉర్రూతలూగించిన
' సుందరదాసు M.S.రామారావుగారు '
తన 72వ సంవత్సరములో అనగా తేది 20-04-1992 న
వైకుంఠధామమును చేరారు.
'సుందరకాండ 'అనే పదము వినగానే ఆయనే జ్ఞాపకము వస్తారు.
మృదు మధురమైన పదములతో రచించడమే కాకుండా
హృదయాలకు హత్తుకునే రాగములతో స్వరపరచి గానము
చేయడము అనన్య సాధ్యమైనది. ఆయన నమ్మిన
'గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి'
దగ్గరవుండి ఆయనచేత వ్రాయిస్తే గాని అంత ఆకర్షణ రాదు. 'ఇది నిజము!
'రుక్షుడు 'అనే ఆటవికుడు సప్త మహా ఋషుల చేత ' తారక మంత్రము '
ఉపదేశింపబడి వాల్మీకిగామారి ' బ్రహ్మదేవుడిచేత ఆదేశించబడి
'సంస్కృతములో రామాయణమును రచించాడు.
ఆదికావ్యమైన ఆ రామాయణము పండితులకే గాని పామరులకు అందలేదు.
అందుచేత 'వాల్మీకినే ''తులసీదాసుగా' పంపించి అవధి (హిందీ ) భాషలో
రామాయణమును రచింపచేశారు. అదిఉత్తరాదివారికి మాత్రమే అందింది.
తెలుగువారి(మన) పుణ్యము చేత
తులసిదాసుగా అవతరించిన వాల్మీకి
మోపర్తి సీతారామారావు గా అవతారమెత్తి
సుందరకాండతో మొదలు పెట్టి (యుద్ధ కాండలో సగము
వరకు ) రామాయణము వ్రాశారు.
ఇది యీ సాధకుని అనుభూతి!
' రాముడు వదలిన బాణములా నూరు యోజనముల
సముద్రమును దాటి లంకకు వెళ్ళిసీతమ్మను వెతుకుతాను '
అన్న హనుమ ( సుందరకాండలోని )మొదటి మాటలను ప్రేరణగా
తీసుకొని M.S. రామారావుగారు 'శ్రీ హనుమాను గురుదేవులు
నా యెద పలికిన సీతా రామకధా! నే పలికెద సీతారామకధా !'
అన్నారు. ఇంకా నలుగురు భక్తితో ఆలకించగా ,
'నలుగురు భక్తితో ఆలపించగా ' అంటూ
యెందరో తన సుందరకాండను గానముచేసుకోవచ్చును అని తెలిపారు.
అంతే కాదు ఆయన తన స్వ హస్తాలతో యీ సాధకునికి
తేది11-09-1978 న ఆశీస్సులతో సుందరకాండ పుస్తకమును యిచ్చారు.
గురుదేవులు శ్రీఆంజనేయస్వామి దయతో యీ సాధకుడు
తేది 30-03-1995 న సుందరకాండ కధాగానము ప్రారంభించి
M.S. రామారావుగారి 18 వ వర్ధంతి నాడు అనగా
తేది 20-04-2010 న తూర్పుగోదావరి జిల్లాలో ,అనపర్తి మండలములో,
పొలమూరు గ్రామములో, శ్రీ షిరిడీ సాయి మరియు శ్రీఅయ్యప్ప దేవాలయముల
10 వ వార్షికోత్సవ సంధర్భముగా 635 వ సుందరకాండ గానముతో
' సుందర దాసు M.S.రామారావు గారికి నివాళులు
అర్పించగలగడము ' మహద్భాగ్యముగా భావిస్తున్నాడు.
జై మారుతీ! జై జై మారుతీ !!
.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి