.

హరి ద్వార్ , ౠషీకేశ్ లలో సాధన!



హరి-హరుల స్థావరాలకు ( కైలాస ,వైకుంఠములకు ) ద్వారమైన హరిద్వార్ నకు - భగీరధుడు భగీరధ ప్రయత్నముతో ధరణికి తెచ్చిన గంగోత్రితో కలసి మందాకినీ , అలకానంద నంద , పిండర గంగ మొదలైన పుణ్య నదులు సంగమముగా యేర్పడి హిమాలయములపైనుండి భూమి మీదకు పరవళ్ళు త్రొక్కుచూ ప్రవహించే పుణ్య క్షేత్రములైన ఋషీకేశ్ ,హరిద్వార్ లలో ఒక వారము దినములు భక్తి పారవశ్యముతో భగవత్ సాన్నిధ్య దివ్యానుభూతిని పొందుటకు తేది 03-05-2010 న బయలుదేరుతున్నాము.

గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయతో ఈ సాధకుడు యిప్పటికి నాలుగుపర్యాయములు కేదార్ నాథ్ , బదరీ నాథ్ వెళ్ళటమువలన యెంతో ఆధ్యాత్మిక శక్తిని తెచ్చుకున్నాడు.

ఏవిధముగా అంటే - హిమాలయా పర్వతాలలో జనారణ్యానికి దూరముగా ఆ లోయలలో , పర్వతాలలో వారము దినములు ప్రయత్నించినా వారిని చేరలేని ప్రదేశాలలో యెంతోమంది తపస్సు చేసుకుంటున్నారు. వారు ప్రతీ దినము మూడు సంధ్యలలో ఆపూట చేసిన తపస్సు ద్వారా వచ్చిన ఫలితములో కొంత భాగాన్ని లోక కళ్యాణముకై తర్పణములు వదలుతారు. అటువంటి పుణ్యాత్ముల చుట్టూ వారి తపశ్శక్తి వలయాలు ఎంతో దూరానికి విస్తరిస్తుంటాయి.

ఆ శక్తి వలయాలు వారి తపశ్శక్తినిబట్టి చాలా కిలోమీటర్లవరకు వ్యాప్తి చెందుతుంటాయి. అటువంటి శక్తి తరంగాల పరిధిలోనుండే మనము ఆ ప్రదేశాలలో తిరుగుతుంటాము. వారు ఎవరో మనకు తెలియకపోయినా మన ప్రార్ధనబట్టి వారి అనుగ్రహమును మనము పొందవచ్చును.

ఇప్పుడు పూర్వజన్మ సుకృతముకొద్దీ యీ సాధకుడు ఒక వారముదినములు ఆ పుణ్య క్షేత్రములలో సాధనకై వెళ్ళగలుగుతున్నాడు. స్వామీ రక్ష ! శ్రీరామ రక్ష !!

జై మారుతీ! జై జై మారుతీ !!

.

1 కామెంట్‌లు:

karthik చెప్పారు...

happy journey sir

కామెంట్‌ను పోస్ట్ చేయండి