ఖండ ఖండాంతరాలలో నాగరికత కన్ను విప్పేనాటికే సభ్యతకు, సంస్కారానికి, నైతిక-ధార్మిక ఆదర్శాలకు పేరు పడ్డది మన భరత ఖండము. చతుర్వేదములు ,ఉపనిషత్తులు,రామాయణము ,భాగవతము,అష్టాదశ పురాణములు వంటివి మన కర్మభూమిని ఆధ్యాత్మికముగా శక్తివంతముగా చేస్తుండగా -
అనేక ఋషుల సందేశములతో,అనేక తపశ్శాలుల దివ్య శక్తులతో,పుణ్య క్షేత్రములతో,అనేక తీర్ధములతో,సిరి సంపదలతో బంగరు భూమివలే అలరారుతుండేది .
మన పవిత్ర పుణ్య భూమి అయిన భారతావనిలో యెందరో మహానుభావులు ఉండేవారు -
* వశిష్ఠ ,వాల్మీకి, వ్యాస ,విశ్వామిత్రుల వంటి యెందరో మహర్షులు
*శ్రీరాముడు ,శ్రీకృష్ణుడు, బుద్దుడు, దత్తాత్రేయుడు వంటి అవతార పురుషులు
* గురునానక్,శంకరాచార్యులు ,మధ్వాచార్యులు , రామానుజాచార్యుల వంటి మతప్రవర్తలు
* జ్ఙానేశ్వర్, ఏక్ నాథ్,తుకారాం,నామదేవ్ , మీరాభాయి, రామదాసు, కబీరుదాసు, త్యాగరాజు, రాఘవేంద్రస్వామి, చైతన్య మహాప్రభు, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, మోహందాస్ కరంచంద్ గాంధీ, శ్రీ సత్య సాయిబాబా వంటి మహాత్ములు
* రామకృష్ణ పరమహంస ,వివేకానంద, రమణ మహర్షి , అల్లూరి సీతారామరాజు వంటి ఆధ్యాత్మిక వేత్తలు జన్మించారు.
వెయ్యేండ్ల బానిసత్వములో [యింతటి ఘనత కలిగిన మన భరతావనిలో] హైందవ విజ్ఙానము ,విజ్ఙాన కేంద్రాలు చాలా విధ్వంసానికి గురి అయినాయి.
ముస్లింల కాలములో ప్రత్యక్ష విధ్వంసము సాగింది. వారి దండయాత్రలలో అపారమైన ధన సంపత్తులు కొల్లగొట్టబడ్డాయి. అంతే కాదు అనేక క్షేత్రాలలో దేవతా మూర్తులు ధ్వంసమయ్యాయి. హిందూమత పెద్దలు ,భక్తులు హింసించబడ్డారు.
ఆంగ్లేయుల కాలములో భారతీయ మస్తిష్కమే విధ్వంసానికి గురి అయింది.
మన జాతిని శాశ్వతముగా లొంగదీసుకొని ఉంచుకొనడానికి గాను మన మస్తిష్కాన్నే మార్చివేయటము తగిన ఉపాయమని ఆంగ్లేయులు భావించారు.
అందుకు తగిన విద్యా విధానాలు, పద్దతులు ప్రవేశపెట్టారు.
మన ప్రాచీన విజ్ఙాన సర్వస్వాన్ని త్రోసి పుచ్చారు.
పాశ్చత్య రీతుల ఘనతను గురించి మనకు నూరిపోయసాగారు.
పర్యవసానముగా రూపములో భారతీయులుగా ఉంటూ బుద్దిలో పాశ్చాత్యులుగా ప్రవర్తించేవారు పుట్టుకొచ్చారు.
స్వరాజ్యము రాగానే యీ పరిస్తితి మారి భారతీయమైన ప్రజ్ఙ ,మేధస్సు వికసించి ఉండవలసింది కాని అలా జరగలేదు.
జ్ఙానులకు, విజ్ఙానులకు ,వివేకవంతులకు, పండితులకు, ఘనాపాటీలకు, శాస్త్రజ్ఙులకు బుద్దిమంతులకు ,పీఠాధిపతులకు, ఐశ్వర్యవంతులకు, కార్మికులకు కొదువలేదు.
కొరపడింది దేశభక్తి మాత్రమే!
సగటు భారతీయుని గుండెలో గూడుకట్టుకున్న ఆవేదనలు పెద్దలకు అర్ధము కావడము లేదు.
జై మారుతీ! జై జై మారుతీ!!
స్వామి రక్ష! శ్రీ రామ రక్ష!!
శ్రీ రామ రక్ష! సర్వ జగద్రక్ష!!
1 కామెంట్‌లు:
మీరు చెప్పినది అక్షర సత్యము. చిన్నప్పటి నుండే ధార్మికత్వం, సభ్యత సంస్కారాలు భోధించే విద్య లుప్తమైపోవడమే ఈ పరిస్థితికి కారణమనుకొంటున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి