.

జర్మనీకి తరలి వెళ్ళిన మన ఆధ్యాత్మిక సంపద!

పోర్చుగీసు వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఇంగ్లీషు వారు వచ్చి మన సంపదను తీసుకు వెళ్ళితే 1760 లో జర్మను పండితులు వచ్చి మన విజ్ఞాన్నాన్ని తీసుకు వెళ్ళి జర్మను భాషలోనికి తర్జుమా చేసుకున్నారు.ఆ విధముగా మన భారతదేశము గొప్పదనము,ఔన్నత్యము వారికి అర్ధమయింది.

1780 లో J Adverd thomson భగవద్గీత మీద తన అభిప్రాయము [ comment] వ్రాశారు. అప్పటినుండి జర్మనులు మన వేదములతో పాటు మన ఘనాపాటీలను, ఉద్ధండ పండితులను వారి దేశమునకు తీసుకువెళ్ళి నెలల తరబడి కృషిచేసి వేదాలను,వాటి సారములను గ్రహించి వాటిని జర్మను భాషలోనికి అనువాదము చేసుకున్నారు.

విచిత్రము ,యధార్ధము యేమిటంటే యెంతో ప్రాచీనమైన ,మహత్తరమైన మన వేదములు మొట్టమొదట మన దేశభాషలలో ముద్రింపబడలేదు. అర్హత కలిగిన శిష్యులకు నొటి మాటగా[శృతులుగా] చెప్పేవారు. లిపి ద్వారా యివి ప్రచారములోనికి వస్తే అనామకులు, అర్హత లేనివారి చేతిలో పడి నిష్ప్రయోజనమవుతాయని భయపడేవారు. అందుచేత తరతరాలుగా మన వేదములు వంశపారంపర్యముగా గురువులనుండి శిష్యులకు చెప్పబడేవి.

19 వ శతాబ్దము చివరిలో Max Muller అను జర్మను పండితుడు మన వేదాలను జర్మను భాష నుండి ఆంగ్లములోనికి తర్జమా చేశారు. ఆ క్రమములో ఆయన రోజుకి 17 నుండి 18 గంటలు పనిచేసేవారు. ఆయన చేసిన అనువాదములు సుమారు 100 పుస్తకములు[volumes] గా వచ్చాయి.వాటికి పీఠిక [ index] 1000 పేజీల గ్రంధముగా వచ్చింది. దాంతో ప్రపంచమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది.

మన ఆధ్యాత్మిక సంపద ప్రపంచానికి మార్గదర్శకమయింది. ఎన్నో యుగముల క్రిందటవి అయినా యిప్పటికాలానికి కూడా అన్వయించుకోవచ్చును.

శ్రీ రాముని నామము, శ్రీ కృష్ణుని ఉపదేశము యీ రెండే రెండు భారత దేశమునకు గల శక్తులు. ప్రపంచ ప్రజలు గుర్తించగలిగితే యాచ్\వత్ ప్రపంచము యొక్క శక్తులని చెప్పవచ్చును.ఒకటి రెండవది సామ్యయోగ ఉపదేశము అని ఆచార్య వినోబాభావే అన్నారు.

అంతటి గొప్ప శక్తులు గ్రంధములలో మాత్రమే మిగిలిపోతున్నాయి. నేటి కాలములో ఆధ్యాత్మికత ఆ భావములు లేనివారిచేతిలో చిక్కిపోయింది.
జై మారుతీ! - జై జై మారుతీ!

స్వామి రక్ష! - శ్రీరామ రక్ష!

శ్రీ రామ రక్ష! - సర్వ జగద్రక్ష!

మాతృదేవోభవ! - పితృదేవోభవ! -ఆచార్య దేవోభవ!

సుందర కాండ కధా గాన శిరోమణి ---- కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్ , 49-27-42,మధురా నగర్, విశాఖపట్నం,ఆంధ్ర ప్రదేశ్,ఇండియా, 530016.

.

1 కామెంట్‌లు:

durgeswara చెప్పారు...

chaalaa machi post vraasaaru abhinamdanalu

కామెంట్‌ను పోస్ట్ చేయండి