దేముడిని తరిమేశాము. మన దేశ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిలో వందల సంవత్సరాలు నిమగ్నమయిపోయిన పాత తరాలవాళ్ళు మన సనాతన సాంప్రదాయాలను,సంస్కృతులను, సంస్కారాలను వదలివేశారు. జైళ్ళలో మగ్గినవారు,ప్రాణాలు కోల్పోయినవారు, ఆస్తులు కోల్పోయినవారు ఆప్తులను కోల్పోయినవారు ఎక్కువ అయిపోయి మన కర్మ భూమిలో మన వేద భూమిలో అధ్యాత్మికత కొరవడింది. ఇప్పుడున్న పాత తరము వారికి - వారి ముందు తరాలవారినుండి వంశపారపర్యముగా రావలసిన ఆచారాలు కనుమరుగయినాయి. ఆధునిక ప్రపంచములో యాంత్రిక సౌకర్యాలు ఎక్కువ ప్రభావము చూపిస్తున్నాయి. ' చాకలిని[ వాషింగుమెషిను] ఇంటి లోనికి తెచ్చుకున్నాము - మంగలిని [షేవింగు సెట్టు ] ఇంటిలోనికి తెచ్చుకున్నాము- సినిమా హాలును[ టివి సెట్టు ] ఇంటిలోనికి తెచ్చుకున్నాము ఎక్కడో ఉన్న హిమాలయాల వాతావరణ్ణాన్ని [ఎ సి మెషిను ] ఇంటిలోనికి తెచ్చుకున్నాము- ఎక్కడో ఉన్న గంగను [కొళాయి నీరు] ఇంటిలోనికి తెచ్చుకున్నాము - కాని ఇంటిలో తర తరాలుగా ఉన్న దేముడిని మాత్రము తరిమేశాము ! అందుకే అతి వృష్టి, అనావృష్టి మాత్రమే కాకుండా చిత్ర విచిత్రమైన వ్యాధులు జనాలను కబళిస్తున్నాయి. ఇప్పుడు భక్తి లేదని కాదు ఉన్నాది కాని అది బహిర్ముఖ భక్తి మాత్రమే!
జై జై మారుతీ ------- ఉమాప్రసాద్ కొమ్మూరు [తెలుగు బ్లాగు 18782]
.
6 కామెంట్‌లు:
హహహ జోకులు బాగున్నాయి!
ఇన్ని చేసినా మా ఇంట్లో నుంచి ఇంకా తులసిని మాత్రం తరిమేయ్యలేక పోతున్నందులకు సంతోషిస్తున్నాం
హ్హ హ్హ అనుకుంటున్నా ...ఇంకా మీరు రాలేదేమా అని... వచ్చారా .. చాలా సంతోషం
>>హహహ జోకులు బాగున్నాయి!
మీకన్నా నా ....
అబ్బా చా!
కత్తి గారు చాలా చొట్ల హ హ హ అని పెడుతూ వుంటారు.. ఏ విషయానికి ఆయనకి నవ్వు వస్తుందొ నాకెప్పుడూ అర్దం కాదు. అయనకున్న సెన్స్ అఫ్ హ్యుమర్ నాకు లేదో.. లేక అయనకు అర్ధం అయ్యే జొకులు నాకు జొకులు అర్ధం కావొ... మొత్తానికి తేడా అయన్లొ వుందొ నాలొ వుందొ ... ఎమీ అర్ధం కావట్లా..
నీళ్ళను కూడా "కొని" తెచ్చుకుంటున్నాము. సౌలభ్యం పేరుతో పనికిరాని ప్లాస్టిక్ ఉపకరణాలను వాడుతున్నాము. ప్రతి వ్యక్తిని, ప్రతి మాటను, ప్రతి భావాన్ని, ప్రతి ఆలోచనను - ఉపయోగం అన్న త్రాసులో తూస్తున్నాము. వ్యక్తిగతం, సామాజికం, సృజనాత్మకత, శాస్త్రం, ఇలా అనేక వైవిధ్య భరితమైన విషయాలను సమన్వయ పరచగల భారతీయ చింతనను పక్కకు నెట్టి ఎవడో చెప్పిన సిద్ధాంతాలను ఎవడి ఉపలబ్ధి కోసమో తలకెక్కించుకుంటున్నాము.
కామెంట్‌ను పోస్ట్ చేయండి