.

15 కోట్లు శ్రీ రామ నామములతో స్థూపము ప్రతిష్ఠాపన


     

భక్తులకు నమస్కారము. విశాఖపట్నము శ్రీ సాలిగ్రామపురము లోని శ్రీ కోదండ రామాలయములో 15 కోట్లు శ్రీరామనామములు నిక్షిప్తము చేసి 15 అడుగుల స్థూపము ప్రతిష్ఠాపనము జరిపించుటకు దైవఙ్ఞులు మంగళశాశనము చేసిరి.    శ్రీ సి మోహనరెడ్డిగారు    ( విశాఖపట్నము పోర్టు ట్రష్తులో డెప్యూటీ చీఫ్ ఇంజనీరుగా పదవీ విరమణ చేశారు.)   స్వయముగా వ్రాసిన ఒక కోటి శ్రీరామ నామములతో శ్రీరామకోటి స్థూప నిర్మాణము తన స్వంత  ఖర్చులతో ప్రారంభించిరి.వారి ఆహ్వానముతో భూమి పూజకు హాజరు అయిన యీ  సాధకుడు   అప్పటికి తన వద్దనున్న 7 కోట్లు శ్రీరామనాములు కూడా  స్థూపములో నిక్షిప్తము జరిపించుదాము అని అడిగితే వారు ఆనందముగా అంగీకరించిరి. వార్తాపత్రికల ద్వారా తెలియజేస్తే ప్రస్తుతము మొత్తము  13 కోట్లు శ్రీ రామనామములు సేకరించబడినవి. స్థూపము ప్రతిష్టాపనము  తేదీ 14-2-2013 న నిశ్చయించిరి. కావున భక్తులకు విన్నపము! 1008 శ్రీరామనామములకు  తక్కువ కాకుండా మీరు వ్రాసి పంపి అపూర్వమైన, మహత్తరమైన ,శక్తివంతమైన , ముక్తిదాయకమైన యీ శ్రీరామ  కార్యము నందు భాగస్తులు అయి మీరు తరించి మమ్ములను ధన్యులుగా చేయమని కోరుతున్నాము.ఇప్పటికే వ్రాసిన శ్రీరామ నామములు కూడా పంపించవచ్చును.       .ధనము కోరడములేదు.మన పర ధనమును పెంచుకుందాము. --------కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్ ,49-27-42 ,మధురానగర్ , విశాఖపట్నము , 530016 ,ఆంధ్రప్రదేశ్ ,ఇండియా. సెల్ .9848462805
.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి