గురుదేవులు "శ్రీఅంజనేయస్వామి" దయ వలన యీ విధముగా బ్లాగు గ్రూపు ద్వారామీ అందరితో కలిసే అవకాశము కలిగింది.
" మాత్రుదేవోభవ! పిత్రుదేవోభవ! అచార్యదేవోభవ!" అను కోవడము మాత్రమే మనకు తెలుసును. ఆచరణలో పెట్టకపోవడము వలన మనము చాలా కొల్పోతున్నాము.
ప్రత్యక్ష దైవాలయిన మన తల్లితండ్రులను నిరాదరణకు గురిచేసి భగవంతుడిని ఎంత పూజించినా భగవంతుడు మనలను ఆదరించడు. తల్లితండ్రులను పెద్దలను గురువులను గౌరవించకపోతే మన పరిస్తితికూడా అంతే జరుగుతుంది.
మన సనాతన సాంప్రదాయాలనూ ఉమ్మడి కుటుంబ వ్యవస్తలను వదలి పాశ్చ్యాత్తుల ప్రభావములో పడిపోతున్నాము.ఎటో వెళ్ళిపోతున్నాము. ఇది నిత్యమూ ఎందరో పెద్దల మదిలో మెదిలే వ్యధ.
"జై మారుతీ-జై జై మారుతీ"
'శ్రీ మారుతీ పదభక్త - ఉమాప్రసాద్ కొమ్మూరు
.