ఈ సాధకుడు 9 రోజులు సుందరకాండ కార్యక్రమములు చేసినప్పుదు 1008 శ్రీరామనామములు పట్టు పుస్తకములు ఆసక్తి కలవారికి అందజేసి వ్రాయించి సేకరించినవి 100 పుస్తకములు (ఒక లక్ష శ్రీరామనామములు ) కలిపి కట్టి ఉంచాము. మరలా 3 లక్షల శ్రీరామనామములు కలిపి కట్టి ఉంచాము.చిన్న పుస్తకాలు అవడము వలన ఎక్కువ స్థలము అవడమువలన ( 9 సంఖ్య కోసము ) 36 లక్షల శ్రీరామనామములు కలిపి కట్టి పసుపు రంగు పంచతో చుట్టి మరల గట్టి తాదులతో కట్టి ఉంచుతాము పుస్తకముల మధ్యలో వాసన ఉండలు పెడతాము.
లక్ష శ్రీరామనామములు వ్రాసి ఉన్న పుస్తకాలను 9 పుస్తకాలను కలిపి కట్టి మరల 9 కట్టలను కలిపి ( 81 లక్షల శ్రీరామనామములు) పసుపు రంగు పంచతో చుట్టి మరల తాడులతో కట్టి ఉంచుతాము.
ఇక ప్రతిష్టాపనము జరుగు విధానము. వైష్ణవ ఆగమ శాస్త్ర ప్రకారము 30 కి పైగా ఆలయ ప్రతిష్టలు చెయించిన పూజ్యులు శ్రీమాన్ ఇరగవరపు గోపాలాచార్యుల వారి పర్యవేక్షణలో, యంత్రమునకు , శ్రీరామనామము చెక్కిన శిలాఫలకమునకు ( లఘు ప్రతిష్ట) అంకురార్పణముతో , అధివాసములతో హోమములతో , కళల అవాహనతో ప్రాణప్రతిష్ట జరుగును.
నిక్సిప్తము జరుగు విధానము.స్థూపము 8 ముఖములుగా నిర్మించబడుతున్నది 4 అడుగుల పీఠము పైన 7 అడుగుల స్ఠూపము( శ్రీరామనామములు నిక్షిప్తము చేయుటకు ) పై భాగములో 2 అడుగుల స్ఠలము ఖాళీగా వుంచుతున్నాము. ఒక కఱ్ఱకి చిన్న కొక్కెము బిగించి దానితో ఒక్కొక్క మూటను లోనికి జాగ్రత్తగా దించి కొక్కెమును తప్పించి కఱ్ఱను తీసివేస్తాము.
ఆరాధనతో ,సర్వ సమర్పణముతో, చిత్త శుద్ధితో ,నిరాడంబరముగా జరుపుటకు సంకల్పము చేసుకున్నాము.
వివరములు అడిగినందుకు ధన్యవాదములు.
------ జై మారుతీ ! జై జై మారుతీ !!
మీ ఉమాప్రసాద్
.