సాధారణ జీవితాన్ని గడుపుతున్న నన్ను 'ఆంజనేయస్వామి ' 1978 లో ఆధ్యాత్మిక మార్గములోనికి మరల్చి సాధకునిగా తీర్చి దిద్ది నడిపిస్తున్నారు. సుందర దాసు ఎం ఎస్ రామారావు గారి తెలుగు హనుమాన్ చాలీసా గానమును మొదటి కానుకగా ఇచ్చారు. వారి సుందరకాండ పుస్తకమును వారి చేతే ఆశీస్సులతో 11-09-78 తేదీన ఇప్పించారు. మొదటి సుందరకాండ కార్యక్రమమును భగవత్స్వరూపులు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యుల స్వామి వారి మంగళాశాసనములతో 31-03-95 తేదీన ప్రారంభింపచేశారు. 1,3,5,7,9,11 రోజులపాటు కార్యక్రమములు అభినయ పూర్వకముగా, వ్యాఖ్యాన సహితముగా [సన్నివేశము కనిపించు రీతిలో] జరుగుతున్నాయి. ఇప్పటికి అనగా 04-11-09 తేదీనాటికి సుందరకాండ కార్యక్రమములు 628 జరిగాయి. 19 కోట్లు " శ్రీ రామ నామములు " భక్తుల చేత వ్రాయించి సేకరింపబడ్డాయి. అందులో 13 కోట్లు స్థూపములోను,ప్రతిష్థల సందర్భముగాను, స్వామి విగ్రహము హృదయమునందు సద్వినియోగము గావించ బడినాయి. సకల దేవతల సంకీర్తనలు 7000 లకు పైగా జరిగినవి. తులసీదాసు హనుమాన్ చాలీసా పునశ్చరణలు 2 లక్షలకు పైగా జరిగనవి.