.

శ్రీరామ భక్తులందరికి నమస్కారములు.

సకల ధర్మములను ఆచరణలో చూపించిన శ్రీరామచంద్రుని భక్తులను చిరంజీవి అయిన ఆంజనేయస్వామి వెతుకుతున్నారు. శ్రీరాముని ఆరాధిస్తున్న నిజమైన భక్తులను గుర్తించి వారిని సరి అయిన మార్గములో నడిపించుటకు ఆయన కంకణము కట్టుకొని ఉన్నారు. త్రికరణ శుద్దితో శ్రీరాముని కృపకై ప్రయత్ని ంచేవారు శ్రీ ఆంజనేయస్వామి ద్వారా వెళ్ళితేనే శ్రీరామచంద్రుని కృపకు పాత్రులు కాగలరు. ఆంజనేయస్వామి ద్వారా వెల్లితేనే శ్రీరాముడు అనుగ్రహిస్తాడు. శ్రీరాముని సేవిస్తేనే ఆంజనేయస్వామి లొంగుతాడు. ఇది పరమ రహస్యం ! అందుకే మన పెద్దలు హనుమాన్ చాలీసా చదవండి , శ్రీరామ నామములు వ్రాయండి అని చెపుతుంటారు. అహంకారమును శ్రీరాముని పాదాలవద్ద నైవేద్యముగా పెట్టి ప్రయత్నించండి. త్రప్పక సత్ఫలితములము పొందుతారు. ఇది దైవజ్ఞులు అందజేస్తున్న మంగళాశాసనము.

మాతృదేవో భవ ! పితృదేవో భవ !! ఆచార్య దేవో భవ !!!
స్వామి రక్ష ! శ్రీరామ రక్ష !!
శ్రీరామ రక్ష ! సర్వ జగద్రక్ష !!
.

అంతర్జాల మితృలందరికీ హృదయపూర్వక ' ఉగాది ' శుభాకాంక్షలు.

అంతర్జాల మితృలందరికీ హృదయపూర్వక ' ఉగాది ' శుభాకాంక్షలు.
ఈ ' ఖర ' నామ సంవత్సరములో మీరు , మీ కుటుంభసభ్యులు -- మీ సన్నిహితుల , మీ ఆత్మీయుల మన్ననలను పొందుతూ , నిత్య ' దైవ చింతనలతో ' ఆయుశ్శును తగ్గించే రాగద్వేషాలను హృదయములోనికి రానివ్వక , పదిమందికి ఆదర్శముగా ప్రశాంతమైన జీవనము గడపాలని కోరుతూ ,
మీకు ఆశక్తిని మీ ఆరాధ్య దైవము కలిగించాలని " గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామిని " , తల్లీ తండ్రీ సర్వస్వమూ అయిన " శ్రీ సీతారామచంద్రులనూ " ప్రార్ధిస్తున్నాను.
జై మారుతీ ! జై జై మారుతీ !!
స్వామి రక్ష ! శ్రీ రామ రక్ష !!
శ్రీ రామ రక్ష ! సర్వ జగద్రక్ష !!

మాతృదేవో భవ ! పితృదేవో భవ !! ఆచార్య దేవో భవ !!

.